నేచురల్ స్టార్ నాని తన పేరు మార్చుకోబోతున్నారా? ఇండస్ట్రీలో చాలా మంది స్టార్స్ మాదిరిగా స్టార్ డమ్ కోసం స్క్రీన్ నేమ్ ను మార్చుకోనున్నాడా? ప్రస్తుతం వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంత..?
ఎటువంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చి,స్టార్ హీరోగా ఎదిగిన అతి కొద్దిమంది హీరోలలో నేచురల్ స్టార్ నాని ఒకరు. యూత్ తో పాట్ ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా ఆకట్టుకుంటూ వస్తున్న నాని.. తన సినిమాలతో ఎప్పటికప్పుడు ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటూ వస్తున్నాడు. కాగా తాజాగా నాని తన పేరును మార్చుకోబోతున్నాడు అన్న రూమర్స్ గట్టిగా వినిపిస్తున్నాయి. వాటిలో నిజం ఎంత?
25
Nani starrer Hit 3 collection report pre sale
రీసెంట్ గా హిట్ 3 సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు నాని. ఈసినిమాకు నిర్మాతగా,హీరోగా నాని వ్యవహరించాడు. ఈమధ్య వరకూ లవర్ బాయ్ సినిమాలు చేసిన నాని మోనాటనీ చేస్తున్నాడన్న విమర్శను కూడా ఫేస్ చేశాడు. దాంతో దసరా సినిమా నుంచి తన సినిమాల, నటన, కథల ఎంపికలో తేడా చూపించాడు. అద్భుతమైన కథలతో పాటు వైవిధ్యమైన పాత్రలను ఎంపికచేసుకుని.. తనలో ఉన్న మరో కోణం చూపించాడు.
35
Nanis HIt 3 advance collection report
ఈ క్రమంలోనే తాజాగా హిట్ 3 సినిమాలో అర్జున్ సర్కార్ పాత్రలో అదరగొట్టాడు నాని. అసలు ఈ సినిమాలో నటించినంది నానినేనా లేకమరెవరైనానా అనే విధంగా నటించి మెప్పించాడు నేచురల్ స్టార్. సాఫ్ట్ క్యారెక్టర్లతో అద్భుతాలు చేసుకుంటూ వచ్చే నాని. రఫ్ అండ్ రగ్డ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించి హిట్ 3ని సక్సెస్ ట్రాక్ ఎక్కించాడు. ఈ సినిమాతో నాని టైర్ 1 హీరోల లిస్ట్ లోకి వెళ్లిపోయినట్టే అంటున్నారు సినిమా జనాలు.
ఈక్రమంలో నానికి సబంధించిన ఓ వార్త వైరల్ అవుతుంది. ఆయన పేరు మార్చుకోబోతున్నట్టు రూమర్స్ ఇండస్ట్రీలో వ్యాపించాయి. నాని అసలు పేరే చాలామందికి తెలియదు. నాని అని పిలుస్తుంటారు కాని. ఆయన అసలు పేరు ఘంటా నవీన్ బాబు. అయితే మొదటి నుంచి నాని పేరుతో ఆయిన పాపులర్ అయ్యాడు. ఇక స్టార్ హీరో స్టేటస్ వస్తుండటంతో నాని అని స్క్రీన్ పై ఉంటే పేరులో వెయిట్ ఉండదు అనుకుని మంచి స్క్రీన్ నేమ్ కోసం చూస్తున్నాడట నేచురల్ స్టార్.
55
Nani starrer Hit 3 ott
అయితే ఈ విషయంలో నిజం ఎంతో తెలియదు కాని.. ఇలా జరిగే అవకాశమే లేదు అంటున్నారు మరికొంత మంది. ఎందుకంటే నాని పేరుతో నే ఇంతవరకూ ఇండస్ట్రీలో ఎదిగాడు ఈ యంగ్ హీరో. ఈ పేరు యూత్ లో, లేడీ ఫ్యాన్స్ లో బాగా పాపులారిటీ తెచ్చిపెట్టింది. ఇటువంటి పేరు ఆయన ఎందుకు వదిలేస్తారంటు మరోవాదన వినిపిస్తోంది. ఫ్యాన్స్ మాత్రం నేచురల్ స్టార్ కు నాని పేరు అయితేనే బాగుంటుంది అంటున్నారు.