గీతా మాధురితో విడాకులపై నటుడు నందు అదిరిపోయే క్లారిటీ.. లైవ్‌ లో ఆయన చేసిన పనికి ఆశ్చర్యపోవాల్సిందే

Published : May 12, 2024, 03:42 PM IST

నటుడు నందు, స్టార్‌ సింగర్‌ గీతా మాధురీ విడిపోతున్నారంటూ చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి.  తాజాగా అన్ని రూమర్స్ ని బ్లాస్ట్ చేశాడు నందు.   

PREV
17
గీతా మాధురితో విడాకులపై నటుడు నందు అదిరిపోయే క్లారిటీ.. లైవ్‌ లో ఆయన చేసిన పనికి ఆశ్చర్యపోవాల్సిందే

నటుడు నందు, సింగర్‌ గీతా మాధురి ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. నటుడు నందు సినిమాల్లో హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా రాణించారు. రాణిస్తున్నాడు. మరోవైపు సింగింగ్‌ షోస్‌ ద్వారా వచ్చి ఇప్పుడు స్టార్‌ సింగర్‌గా రాణిస్తుంది గీతా మాధురి. ఈ ఇద్దరు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. పెద్దల సమక్షంలోనే మ్యారేజ్‌ జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇటీవలే కొడుక్కి జన్మనిచ్చింది గీతా మాధురి. 
 

27

ఇదిలా ఉంటే ఆ మధ్య గీతా మాధురి, నందు విడిపోతున్నారంటూ రూమర్స్ ఊపందుకున్నాయి. చాలా సందర్భాల్లో ఈ పుకార్లు సోషల్‌ మీడియాని షేక్‌ చేశాయి. నందు కెరీర్‌ డౌన్‌ కావడం, సింగర్‌గా  గీతా మాధురికి కూడా పాటలు పెద్దగా రాకపోవడంతో ఇద్దరి మధ్య విభేదాలతో విడిపోతున్నారనే ప్రచారం జరిగింది. ఇద్దరు దూరంగా ఉంటున్నారనే కామెంట్స్ వచ్చాయి. 
 

37

ఈ నేపథ్యంలో తాజాగా నటుడు నందు క్లారిటీ ఇచ్చాడు. ఇంటర్వ్యూ లైవ్‌లో ఆయన వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఆయన చేసిన పనికి ఆశ్చర్యపోవాల్సిందే. మరి ఇంతకి ఏం చేశాడంటే.. ఇంటర్వ్యూలోనే తన భార్య గీతా మాధురికి ఫోన్‌ చేశాడు నందు. అంతేకాదు వీడియో కాల్‌లో మాట్లాడించారు. ఇద్దరు ఎంత ప్రేమగా ఉన్నారో తెలిపే ప్రయత్నం చేశాడు. 
 

47

 ఆ సమయంలో గీతా మాధురి కారుడ్రైవ్‌ చేస్తూ వెళ్తుంది. మొదట వీడియో ఓపెన్‌ చేయలేదు, నందు చెప్పడంతో ఆన్‌ చేసింది. ఈ సందర్భంగా మరోసారి తన భార్యతో కలిసి ఇంటర్వ్యూ ఇస్తానని చెప్పడం విశేషం. సుమన్‌ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో నందు తన డైవర్స్ రూమర్స్ కి క్లారిటీ ఇచ్చాడు. 

57

ఇదిలా ఉంటే నందు ఈ సందర్భంలో మరో విషయం చెప్పారు. తమ పెళ్లి అయి పదేళ్లు అవుతుందని తెలిపారు. సెలబ్రేషన్స్ లాంటివి ప్లాన్‌ చేయడం లేదన్నారు. ఇప్పుడు చాలా మంది కపుల్స్ ఈజీగా విడిపోతున్నారని, ఆ బాధలో ఉంటున్నారని, ఇలాంటి సమయంలో తాము ఇలా పెళ్లి రోజు సెలబ్రేషన్స్ చేసుకుంటే వాళ్లు బాధపడతారు. అదే సమయంలో తమని విమర్శిస్తారు. అందుకే ఆ సెలబ్రేషన్స్ కి దూరంగా ఉంటామన్నారు. ఇంట్లో ప్రైవేట్‌గా సెలబ్రేట్‌ చేసుకుంటామని చెప్పారు. 
 

67

నందు ప్రస్తుతం నటుడిగా, యాంకర్‌గా రాణిస్తున్నాడు. `ఢీ` షోకి ఆయన యాంకర్‌గా రావడం విశేషం. గతంలో ప్రదీప్‌ ఉండగా, ఆయన స్థానంలో నందుని తీసుకున్నారు. ప్రదీప్‌ స్థాయిలో ఎంటర్టైన్‌ చేయలేకపోతున్నాడు నందు. దీంతోపాటు ఐపీఎల్‌ మ్యాచ్‌లకు కూడా ఆయన యాంకరింగ్‌ చేస్తున్నాడు. మ్యాచ్‌ బ్రేకుల్లో సెలబ్రిటీలతో మాట్లాడించడంలో నందు యాక్టివ్‌గా ఉంటూ ఆకట్టుకుంటున్నారు. దీంతోపాటు నటుడిగానూ మెప్పిస్తున్నాడు నందు. 
 

77

గీతా మాధురి, నందలకు కూతురు ప్రకృతి ఉంది. ఇటీవలే ఫిబ్రవరిలో రెండో సంతానం కలిగింది. కొడుకు పుట్టారు. ఇక గీతా మాధురి సింగర్‌గా రాణిస్తున్న విషయం తెలిసిందే. ఆమె హస్కీ వాయిస్‌తో స్పెషల్‌ సాంగ్‌లకు కేరాఫ్‌గా నిలిచింది. ఇప్పుడు కూడా విభిన్నమైన పాటలు పాడుతూ అలరిస్తూనే ఉంది.  
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories