ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం కార్తీక్ ఆరోగ్యంపై వదంతులు వ్యాపించాయి. దీనిపై ఆయన కొడుకు గౌతమ్ కార్తీక్ కూడా క్లారిటీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో కార్తీక్ తన ఇంట్లో కోట్ సూట్ వేసుకుని, కర్రసాము చేస్తున్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఈ వీడియోను రాత్రిపూట తీశారు.
ఈ వీడియోను నటుడు, సీనియర్ జర్నలిస్ట్, నిర్మాత చిత్ర లక్ష్మణన్ తన ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.నటుడు కార్తీక్ తెలుగులో సీతాకొక చిలుక, అన్వేషణ, అభినందన లాంటి అద్భుతమైన చిత్రాల్లో నటించారు.