ఆమె సోషల్ మీడియా సారాంశం ఏంటంటే.. మగాళ్లు మొదట్లో బుజ్జి కన్నా అంటూ మాయలో పాడేసుకుంటారు. నీకు మానసికంగా, శరీరకంగా దగ్గరవుతారు. ఎప్పుడైతే నువ్వు అతన్ని ప్రేమించడం మొదలుపెడతావో అసలు రూపం బయటికి తీస్తారు. నీపై లేనిపోని కండీషన్స్ పెడతారు. వినకపోతే వదిలేస్తానని భయపెడతారు. తాగొచ్చి కొడతారు. డబ్బుల కోసం హింసిస్తారు. మన అందమే మన శత్రువు. ఆ అందం కోసం మనకు దగ్గరైన మగాళ్లు మనల్ని లోబరుచుకుని తర్వాత హింసిస్తారంటూ... అమ్మాయిలకు కరాటే కళ్యాణి హిత బోధ చేసింది.