స్టార్ హీరోలను మించిపోయిన జగ్గూ భాయ్ సంపాదన... రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవుతారు!

First Published Feb 13, 2021, 5:28 PM IST


హీరోలు విలన్స్ కావడం, విలన్స్ హీరోలు కావడం సినిమా పరిశ్రమలో సాధారణమే. అయితే ఓ ఆర్టిస్ట్ సంపాదన హీరోగా ఉన్నప్పుడుకంటే విలన్ గా ఎక్కువ ఉండడం అనేది మాత్రం అసాధారణం అని చెప్పాలి. అలాంటి అరుదైన ఫీట్ సాధించారు నటుడు జగపతిబాబు. 
 

స్టార్ ప్రొడ్యూసర్ వీబీ రాజేంద్ర ప్రసాద్ కుమారుడిగా వెండితెరకు పరిచయమైన జగపతిబాబు... మాస్ హీరోగా ఎదగాలని ప్రయత్నాలు చేశారు. కెరీర్ బిగినింగ్ లో ఆయన అలాంటి కథలే ఎంచుకున్నారు.
undefined
అయితే జగపతి బాబును హీరోగా నిలబెట్టి, ఆయనకు మైలేజ్ ఇచ్చింది మాత్రం ఫ్యామిలీ చిత్రాలు. శుభలగ్నం, మావిడాకులు, పెళ్లి పందిరి, శుభాకాంక్షలు వంటి చిత్రాలు జగపతిబాబును ఫ్యామిలీ హీరోగా నిలబెట్టాయి.
undefined
ఓ సపరేట్ ఫ్యాన్ బేసుతో ఫ్యామిలీ చిత్రాల హీరోగా జగపతి రెండు దశాబ్దాలు వెండితెరపై దూసుకుపోయారు. జగపతి సినిమా అంటే ఇంటిల్లపాది హాయిగా నవ్వుకుంటూ, ఎమోషన్స్ ని ఎంజాయ్ చేస్తూ చూసేయవచ్చన్న గుర్తింపు ఆయన తెచ్చుకున్నారు.
undefined
ఏహీరో సినిమాలలోనైనా మొనాటమీ ఎక్కువైతే ప్రేక్షకులు పక్కన పెట్టేస్తారు. జగపతిబాబు విషయంలో కూడా అదే జరిగింది. ట్రెండ్ మారడంతో పాటు ఒకే తరహాలో వస్తున్న జగపతిబాబు చిత్రాలు ప్రేక్షకులు నచ్చలేదు.
undefined
అలాగని అప్పుడప్పుడూ ప్రయోగాలు చేసినా, అవి సక్సెస్ కాలేదు. ఒక దశకు వచ్చే నాటికి జగపతిబాబుకు క్యాలెండరులో సినిమాలు, చేతిలో డబ్బులు లేకుండా పోయాయి.
undefined
జూదం వ్యసనం కారణంగా జగపతిబాబు ఇంటితో సహా సర్వం కోల్పోయాడు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా పలు సందర్భాలలో తెలిపారు.
undefined
ఆ సమయంలోనే జగపతిబాబుకు, దర్శకుడు బోయపాటి శ్రీను లెజెండ్ లో విలన్ రోల్ ఆఫర్ చేశారు. అప్పుడున్న ఆయన పొజిషన్ కి అది మంచి ఆఫర్, అందుకే కాదన కుండా ఒకే చెప్పేశారు జగపతి బాబు.
undefined
2014లో విడుదలైన లెజెండ్ సూపర్ హిట్.. క్రూరుడైన విలన్ జితేంద్రగా జగపతిబాబు అద్భుతం చేశాడు. ఆ మూవీ విజయంలో కీలక భాగం అయ్యారు.
undefined
అప్పటి నుండి టాలీవుడ్ లో విలన్, సపోర్టింగ్ అండ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా జగపతిబాబు ఫేమస్ అయ్యారు. మంచి హైట్, రూపం కలిగిన జగపతి క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అన్ని రకాల పాత్రలకు సరిపోతారు.
undefined
ప్రస్తుతం జగపతిబాబు సౌత్ ఇండియాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అత్యధిక పారితోషికం తీసుకుంటున్న ఆర్టిస్ట్స్ లో ఒకరిగా ఉన్నారు. తెలుగుతో పాటు పలు భాషల్లో ఆయన సినిమాలు చేస్తున్నారు.
undefined
ఇక జగపతి బాబు రెమ్యూనరేషన్ విషయానికి వస్తే... రోజుకు రూ. 10-15 లక్షలు తీసుకుంటున్నారట. సినిమా స్థాయి బడ్జెట్ ని బట్టి ఆయన రెమ్యూనరేషన్ ఫిక్స్ చేస్తారట.  తెలుగు, తమిళ, కన్నడ మరియు మళయాళ భాషలో కలిపి ఏడాదికి పదికి పైగా సినిమాలు జగపతిబాబు చేస్తున్నారు.
undefined
అంటే ఒక్కో సినిమాకు ఆయన కనీసం 10 నుండి 20రోజులు  పనిచేస్తారు. ఆ విధంగా ఏడాదికి రూ. 25కోట్లకు పైనే జగపతిబాబు సంపాదన ఉన్నట్లు సమాచారం.  విలన్ గా మారిన తరువాత జగపతిబాబు ఆర్థికంగా స్థిరపడంతో పాటు, పోగొట్టుకున్నవన్నీ తిరిగి పొందారట.
undefined
click me!