తెలుగులో వందల సినిమాల్లో నటించిన ఓ నటుడు చిరంజీవి మూవీతో ఓవర్ నైట్ స్టార్ అయ్యారు. చిరంజీవి నటించిన సినిమానే ఆ నటుడికి డెబ్యూ మూవీ. తొలి చిత్రంతోనే అతడు కుంభస్థలం బద్దలు కొట్టాడు.
గొల్లపూడి మారుతీరావు చాలా కాలం పాటు టాలీవుడ్ లో విలక్షణ నటుడిగా ప్రేక్షకులని అలరించారు. విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వందల సినిమాల్లో నటించారు. ఆయన విలనిజంలో ప్రత్యేకమైన శైలి ఉంటుంది. డైలాగులని ఆయన చెప్పే విధానం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. తొలి సినిమాతోనే గొల్లపూడి మారుతీరావు టాలీవుడ్ లో స్టార్ నటుడిగా స్టేటస్ అందుకున్నాడు.
25
నేనేంటి విలన్ గా ఏంటి, అది కూడా చిరంజీవితో..
గొల్లపూడి మారుతీరావు మెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ మూవీ ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య చిత్రంతో నటుడిగా ఎంట్రీ ఇచ్చారు. ఈ మూవీలో ఆయన విలన్ గా నటించిన విధానం ప్రతి ఒక్కరినీ మెస్మరైజ్ చేసింది. ఆ పాత్ర చేసేటప్పుడు అస్సలు కాన్ఫిడెన్స్ లేదట. నేనేంటి విలన్ ఏంటి.. 40 రోజుల షూటింగ్ ఏంటి అని తాను ఆశ్చర్యపోయినట్లు మారుతీరావు తెలిపారు.
35
ఇంటర్వెల్ కే స్టార్ అయిపోయా
కట్ చేస్తే అదే సినిమా 515 రోజులు ఆడింది. తొలి రోజు ఫస్ట్ డే ఫస్ట్ షో ఇంటర్వెల్ కే నేను స్టార్ నటుడిని అయిపోయా. అప్పటి వరకు ఒక్క సినిమాలో కూడా నటించలేదు. నన్ను తీసుకెళ్ళు స్టిల్స్ కోసం చిరంజీవి, మాధవి పక్కన నిలబెట్టారు. నమ్మలేకపోయా అని గొల్లపూడి మారుతీరావు అన్నారు.
కడపలో ఫస్ట్ డే ఫస్ట్ షో చూసి థియేటర్ నుంచి బయటకు రాగానే నా చుట్టూ జనం క్షణాల్లో వచ్చారు. గురువుగారు నమస్తే అని అంటున్నారు. చిరంజీవి సినిమా అనగానే ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య టైటిల్ చిరంజీవి కోసం అనుకున్నారు. కానీ ఆ టైటిల్ విలన్ గా నటించిన గొల్లపూడి మారుతీరావు పాత్ర కోసం దర్శకుడు కోడి రామకృష్ణ పెట్టారు.
55
అదీ చిరంజీవి వ్యక్తిత్వం
ఒక విలన్ పాత్ర కోసం సినిమా టైటిల్ పెట్టడం చాలా రేర్ అనే చెప్పాలి. గొల్లపూడి మాట్లాడుతూ పాపం చిరంజీవి గారు ఇంట్లో రామయ్యే వీధిలోనూ రామయ్యే అండీ అని అన్నారు. చిరంజీవి చాలా కష్టపడే వ్యక్తిత్వం ఉన్న మనిషి అని గొల్లపూడి మారుతీరావు అన్నారు.