Arjun Sarja Fitness: 64 ఏళ్ల వయసులోనూ కుర్రాడిలా యాక్షన్ కింగ్.. అర్జున్‌ సర్జా ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే

Published : Sep 26, 2026, 06:52 PM IST

Arjun Sarja Fitness: 64 ఏళ్ల వయసులోనూ యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా తన ఫిట్‌నెస్‌తో కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు. క్రమం తప్పని వ్యాయామం, మార్షల్ ఆర్ట్స్, యోగా, స్ట్రెచింగ్, కఠినమైన డైట్ ఆయన ఫిట్‌నెస్ సీక్రెట్స్.

PREV
16
ఆరోగ్యకరమైన అలవాట్లే అసలు సీక్రెట్

వెండితెరపై తన యాక్షన్ సీన్స్‌తో అభిమానులను అలరించే 'యాక్షన్ కింగ్' అర్జున్ సర్జా, తన ఫిట్‌నెస్ విషయంలోనూ ఎప్పుడూ వార్తల్లోనే ఉంటారు. వయసు పెరుగుతున్నా ఆయన తన బాడీ, ఎనర్జీ విషయంలో అస్సలు రాజీ పడరు. ఇప్పటికీ ఆయన తన రోజువారీ జీవితంలో వ్యాయామం, ఆరోగ్యకరమైన అలవాట్లకు పెద్దపీట వేస్తారు.

26
క్రమశిక్షణతో కూడిన లైఫ్‌ స్టయిల్‌

అర్జున్ సర్జా ఫిట్‌నెస్ వెనుక ఒక్క రోజు కష్టం లేదు. ఏళ్ల తరబడి ఆయన పాటిస్తున్న క్రమశిక్షణే దీనికి ప్రధాన కారణం. జిమ్, యోగా, వ్యాయామం ఆయన దినచర్యలో ముఖ్యమైన భాగాలు. ఆయన దృష్టిలో ఫిట్‌నెస్ అంటే కేవలం బాడీ షేప్ మెయింటైన్ చేయడం కాదు. ఆరోగ్యం, ఎనర్జీ, మానసిక ప్రశాంతతకు కూడా ఆయన సమాన ప్రయారిటీ ఇస్తారు. అందుకే ఆయన లైఫ్‌స్టైల్‌లో యోగా, ధ్యానానికి ప్రత్యేక స్థానం ఉంది.

36
షూటింగ్ బిజీలోనూ వర్కౌట్స్ మిస్ కారు!

అర్జున్ సర్జా దినచర్యలో వ్యాయామానికి ఎంతో ఇంపార్టెన్స్ ఉంటుంది. ఉదయాన్నే త్వరగా నిద్రలేచి వర్కౌట్ చేయడం ఆయన అలవాటు. షూటింగ్స్ వల్ల ఎంత బిజీగా ఉన్నా ఆయన వ్యాయామం చేయడం మాత్రం అస్సలు మానరు. వేరే దేశాలకు వెళ్లినప్పుడు అక్కడి అత్యాధునిక జిమ్‌లను సందర్శించి, కొత్త ట్రైనింగ్ పద్ధతులను తన వర్కౌట్ రొటీన్‌లో చేర్చుకుంటారు. ఈ క్రమశిక్షణే ఆయన ఫిట్‌నెస్‌ను కాపాడుతోంది.

46
16 ఏళ్లకే సిక్స్ ప్యాక్!

'గలాట్టా ప్లస్' కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అర్జున్ సర్జా తన పాత రోజులను గుర్తుచేసుకున్నారు. తన ఫిట్‌నెస్ జర్నీ గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. "నాకు 16 ఏళ్ల వయసులోనే సిక్స్ ప్యాక్ ఉండేది. అప్పట్లో నన్ను చూసిన వాళ్లంతా చాలా ఫిట్‌గా ఉన్నాడని అనుకునేవారు" అని ఆయన చెప్పారు. చిన్న వయసు నుంచే ఫిట్‌నెస్‌కు ఇంపార్టెన్స్ ఇచ్చిన ఆయన, ఇప్పటికీ అదే అలవాటును కొనసాగిస్తున్నారు.

56
డైట్ విషయంలోనూ కఠిన నియమాలు

అర్జున్ సర్జా ఫిట్‌నెస్ రొటీన్‌లో డైట్‌కు చాలా ప్రాముఖ్యత ఉంది. నూనెలో వేయించిన పదార్థాలను ఆయన ఎక్కువగా తినరు. వాటికి బదులుగా తాజా పండ్లు, ఆకుకూరలకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. ఆయన లైఫ్‌స్టైల్‌లో మరో ఆసక్తికరమైన అలవాటు మొబైల్ వాడకాన్ని కంట్రోల్ చేయడం. రాత్రి పడుకునేటప్పుడు మొబైల్‌ను పక్కన పెట్టుకోకుండా దూరంగా ఉన్న టేబుల్‌పై పెడతానని ఆయన ఇంటర్వ్యూలో చెప్పారు. మొబైల్‌కు వీలైనంత దూరంగా ఉండటాన్ని ఆయన అలవాటుగా మార్చుకున్నారు.

66
యాక్షన్ సీన్స్‌లో డూప్ లేకుండానే..

యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరైన అర్జున్ సర్జా, తన స్టంట్ సీన్స్ విషయంలోనూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు. ఇప్పటికీ చాలా యాక్షన్ సన్నివేశాల్లో డూప్ లేకుండా ఆయనే స్వయంగా నటిస్తారు. దశాబ్దాలుగా తన 'యాక్షన్ కింగ్' ఇమేజ్‌ను కాపాడుకుంటూ వస్తున్న ఆయన, 64 ఏళ్ల వయసులోనూ వ్యాయామం, యోగా, ఆరోగ్యకరమైన డైట్ ద్వారా యాక్టివ్ లైఫ్‌స్టైల్‌ను కొనసాగిస్తున్నారు. ఆయన ఫిట్‌నెస్ వెనుక పెద్ద రహస్యం ఏమీ లేదని, నిరంతర సాధన, క్రమశిక్షణ, ఆరోగ్యంపై శ్రద్ధే ముఖ్య కారణాలని ఆయన మాటలను బట్టి స్పష్టమవుతోంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories