Babu Mohan: టాలీవుడ్ క్రేజీ కాంబినేషన్లలో బాబు మోహన్, కోట శ్రీనివాసరావు కాంబో ఎవర్ గ్రీన్ అని చెప్పాలి. ఇద్దరూ స్క్రీన్ మీద కనిపిస్తే నవ్వుల పంట పండేది. అటువంటిది రాజకీయాల్లోకి వెళ్లాక.. బాబు మోహన్‌ను చూసి కోట కుళ్లుకున్నారని మీకు తెలుసా?
తెలుగు చిత్ర పరిశ్రమలో హాస్య నటులుగా తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు బాబూ మోహన్ - కోట శ్రీనివాసరావు కాంబో. ఈ ఇద్దరూ ఉన్నారంటే సినిమా హిట్ పడినట్టే.. తెరపై ఈ ఇద్దరు కమెడియన్ల కాంబినేషన్ సీన్లకు కిందపడి నవ్వేవారు ఆడియన్స్. 'మామగారు', 'యమలీల' లాంటి సినిమాల్లో బాబూ మోహన్, కోట శ్రీనివాసరావు కామెడీని ఇప్పటికీ మర్చిపోలేము. సినిమాల్లో యాక్టివ్‌గా ఉన్నంత వరకు వీరిద్దరి కాంబో చాలా సినిమాల్లో నటించింది. ఆ తర్వాత కూడా చాలా ఇంటర్వ్యూల్లో సందడి చేసింది. రాజకీయాల్లో కూడా ఈ ఇద్దరూ తమ ప్రత్యేకతను చాటుకున్నారు. ఓ ఇంటర్వ్యూలో బాబు మోహన్ మాట్లాడుతూ.. కోటాతో ఉన్న అనుబంధం గురించి వెల్లడించారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎదురైన అనుభవాల గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
25
కోట శ్రీనివాసరావుతో కాంబినేషన్, బాండింగ్
తెలుగు వెండితెరపై కోట శ్రీనివాసరావు - బాబూ మోహన్ కాంబినేషన్ సుదీర్ఘకాలం పాటు ప్రేక్షకులను అలరించింది. విలనిజంతో పాటు హాస్యాన్ని పండించడంలో వీరిద్దరి టైమింగ్ అద్భుతంగా ఉండేది. ఇంటర్వ్యూలో బాబూ మోహన్ మాట్లాడుతూ.. తమ మధ్య ఉన్న నటన అనుబంధం కేవలం కెమెరా ముందే కాకుండా వ్యక్తిగతంగా కూడా చాలా బలంగా ఉండేదని అన్నారు. సెట్స్‌లో ఇద్దరూ పోటీపడి నటించేవారని, ఒకరి నటనకు మరొకరు తగినట్లుగా సైగలు, డైలాగ్స్ జోడించి సన్నివేశాలను మరింత రక్తికట్టించేవారని గుర్తుచేసుకున్నారు.
35
మంత్రి అయిన తర్వాత కోట స్పందన
నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న తర్వాత బాబూ మోహన్ రాజకీయాల్లోకి ప్రవేశించి శాసనసభ్యుడిగా, ఆ తర్వాత రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. మరో పార్టీ నుంచి కోట శ్రీనివాసరావు కూడా ఎమ్మెల్యేగా గెలిచి.. బాబు మోహన్‌తో పాటు అసెంబ్లీకి వెళ్లేవారు. ఓ సాధారణ నటుడు మంత్రి పదవి చేపట్టినప్పుడు తోటి నటుల ప్రతిస్పందన ఎలా ఉందో ఆయన సరదాగా వివరించారు. తాను మంత్రి అయిన తర్వాత కోట శ్రీనివాసరావు తనను చూసి కుళ్లుకునేవాడని బాబు మోహన్ సరదాగా అన్నారు. "ఎందుకురా మంత్రి పదవి.. హాయిగా ఎమ్మెల్యేగా ఉండకుండా" అని సలహా ఇచ్చేవాడట కోట. అంతేకాదు, తాను ఎలాగో మంత్రి కా లేనని తెలిసి.. బాబు మోహన్‌కు మంత్రి పదవి వచ్చినందుకు తట్టుకోలేకపోయాడట కోట శ్రీనివాసరావు.
బాబు మోహన్ మంత్రి అయినప్పటి నుంచి అసలు అసెంబ్లీకే రావడం మానేశాడట కోట. ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు పక్కపక్కనే కూర్చునే అవకాశం ఉండేది.. కానీ బాబు మోహన్ మంత్రి అయిన తర్వాత సీట్లు మారిపోతాయి.. హోదా కూడా మారిపోతుంది. ఈ విషయంలో కోటను బాబు మోహన్ సరదాగా ఆటపట్టించేవారట. "నేను మంత్రిని.. అక్కడ కూర్చుంటాను.. నువ్వు ఎమ్మెల్యేవి మాత్రమే.. ఇక్కడికి రాకూడదు" అని ఏడిపించేవాడట. హోదా మారినా తమ మధ్య ఉన్న స్నేహం, పాత అనుబంధం ఏమాత్రం తగ్గలేదని బాబూ మోహన్ స్పష్టం చేశారు.
55
బ్రహ్మానందంతో అనుబంధం..
అప్పటి సినీ పరిశ్రమలో ఇతర ప్రముఖ నటులైన బ్రహ్మానందం వంటి కామిక్ దిగ్గజాలతో పనిచేసిన రోజులను కూడా బాబు మోహన్ గుర్తుచేసుకున్నారు. ప్రతి నటుడికీ ఒక ప్రత్యేక శైలి ఉంటుందని, ఎవరికి వారే పరిశ్రమలో తమ ఉనికిని కాపాడుకున్నారని అన్నారు. నటుల మధ్య పోటీ ఉన్నప్పటికీ, ప్రతిభ ఉన్నవారికి తప్పకుండా అవకాశాలు వచ్చేవని ఆయన అభిప్రాయపడ్డారు. బాబూ మోహన్ ఓ ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్న ఈ అనుభవాలు, ఆయన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి.