ఎండలు మండుతున్నయ్.. నువ్వింకా హీట్ పెంచితే ఎలా.. చీరకట్టులో మెరిసిన అషురెడ్డికి నెటిజన్ రిక్వెస్ట్..

First Published | Apr 13, 2023, 10:47 AM IST

యంగ్ బ్యూటీ అషురెడ్డి బ్యూటీఫుల్ లుక్స్ తో కట్టిపడేస్తున్నారు. గ్యాప్ ఇవ్వకుండా రోజురోజుకు మరింతగా గ్లామర్ డోస్ పెంచుతూ దర్శనమిస్తోంది. తాజాగా చీరకట్టులో మెరుపులు మెరిపించింది. దీంతో నెటిజన్లు రకరకాలు కామెంట్లు పెడుతున్నారు.
 

డబ్ స్మాష్ వీడియోలతో అందాల అషురెడ్డి (Ashu Reddy) జూనియర్ సమంతగా క్రేజ్ సంపాదించుకున్న విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ దక్కించుకుంది. తన అందం, టాలెంట్ తో సెలబ్రెటీగా గుర్తింపు సొంతం చేసుకుంది. 

సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma)తో బోల్డ్ ఇంటర్వ్యూ చేసి నెట్టింట సంచలనంగా మారింది. దాంతో యూత్ లో మరింత క్రేజ్ సొంతం చేసుకుంది. రీల్స్ తో సోషల్ మీడియా స్టార్ గా మారింది. ఫాలోయింగ్ ను పెంచుకుంది.
 


రియాలిటీ షో ‘బిగ్ బాస్’ తెలుగు సీజన్ 3లోనూ అవకాశం దక్కించుకుని బుల్లితెర అభిమానులకు పరిచయం అయ్యారు. Bigg Boss Telugu నాన్  స్టాప్ లోనూ ఎంట్రీ ఇచ్చి మరింతగా ప్రేక్షకులకు దగ్గరైంది. అప్పటి నుంచి సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ గా కనిపిస్తోంది.
 

ఇప్పటికే అషురెడ్డి బోల్డ్ లుక్స్ లో ఫొటోషూట్లు చేసి నెట్టింట దుమారం రేపిన విషయం తెలిసిందే. ఇక రీసెంట్ గా చీరకట్టులో దర్శనమిస్తూ మెస్మరైజ్ చేస్తోంది. శారీ లుక్స్ తో పరువాలను ప్రదర్శిస్తూ కుర్రకారును ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మత్తు పోజులతో మతులు పోగొడుతోంది.
 

తాజాగా అషురెడ్డి పర్పుల్ కలర్ చీరకట్టులో దర్శనమిచ్చింది. ట్రాన్స్ ఫరెంట్ శారీ, స్లీవ్ లెస్ బ్లౌజ్ లో టాప్ అందాలను విందు చేసింది. మైమరిపించేలా ఫోజులిస్తూ యంగ్ బ్యూటీ ఫ్యాన్స్ తోపాటు నెటిజన్లను కూడా ఫిదా చేస్తోంది. దీంతో వారు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. 

ఓ నెటిజన్ అషురెడ్డి అందంపై భిన్నంగా కామెంట్ చేయడం ఆసక్తికరంగా మారింది. ‘మేడమ్ మీరూ మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పటికి మా జిల్లాలో ఎండలు 42 డిగ్రీలు కొడుతుంది. మీరూ ఇలాంటి పోస్ట్ లు చేసి ఇంకా పెంచితే ఎలా మేడం..’ అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. ఏదేమైనా ప్రస్తుతం అషురెడ్డి పిక్స్ వైరల్ గా మారుతున్నాయి. ఇక అషురెడ్డి సినిమాల్లోనూ బిజీ అవుతున్నారు. రీసెంట్ గా ‘ఫోకస్’తో అలరించగా.. ప్రస్తుతం ‘ఏ మాస్టర్ పీస్’లో నటిస్తోంది.

Latest Videos

click me!