Ennenno Janmala Bandham: మాళవిక తిక్క కుదిర్చిన సులోచన.. చిత్రను బ్లాక్మెయిల్ చేస్తున్న అభి!

Published : May 15, 2023, 11:42 AM ISTUpdated : May 15, 2023, 11:44 AM IST

Ennenno Janmala Bandham: స్టార్ మాలో ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ప్రేక్షకుల హృదయాలని గెలుచుకొని మంచి రేటింగ్ ని సంపాదించుకుంటుంది. ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ మరో పెళ్లికి సిద్ధపడిన ఒక ఆడదాని కధ ఈ సీరియల్. ఇక ఈరోజు మే 15 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.  

PREV
110
Ennenno Janmala Bandham: మాళవిక తిక్క కుదిర్చిన సులోచన.. చిత్రను బ్లాక్మెయిల్ చేస్తున్న అభి!

ఎపిసోడ్ ప్రారంభంలో చిత్ర కంగారుగా గది నుంచి బయటికి రావడం చూస్తారు దంపతులు. అభి కూడా అదే గదిలోంచి రావటాన్ని చూసి షాక్ అవుతారు. ఏం జరిగింది అంటూ నిలదీస్తాడు యష్. ఏం లేదు వసంత్ రూమ్ అనుకోని ఇక్కడికి వచ్చేసింది అంటాడు అభి. మరి తను ఎందుకు ఏడుస్తుంది అని అడుగుతాడు యష్.

210

తను లోపల ఉండగా డోర్ లాక్ అయిపోయింది మా ఇద్దరినీ ఒకే గదిలో చూస్తే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అని ఏడుస్తోంది. అప్పటికీ నేను ధైర్యం చెబుతూనే ఉన్నాను అంటాడు అభి. ఇదంతా నిజమేనా అని చిత్ర ని అడుగుతుంది వేద. నిజం చెప్తే గొడవవుతుందేమో అనుకొని అవును అంటుంది చిత్ర. సరే పద అంటూ తమతో తీసుకెళ్ళిపోతారు వేద దంపతులు.
 

310

సులోచన ఫంక్షన్ కి వస్తూ ఇక్కడ మాళవిక పెళ్లి కూడా జరుగుతుంది ఏవైనా సమస్యలు వస్తాయేమో అని కంగారు గా ఉంది ఎలాంటి సమస్యలు రాకుండా చూడు భగవంతుడా అని దండం పెట్టుకుంటూ లోపలికి వస్తుంది. చూసుకోకుండా ఆమెకి మాళవిక డాష్  ఇస్తుంది. చూసుకోవాలి కదా అంటూ గొడవకి దిగుతుంది మాళవిక.
 

410

కాసేపు వాదించుకున్న తర్వాత ముసలి దానివి ఒక మూలన ఉండు అని మాళవిక అంటుంది. మెహందీ పెట్టుకున్నావు కదా పంచదార వాటర్ రాస్తే బాగా పండుతుందని తన ఫ్రెండ్ పిలవడంతో వెళ్ళిపోతుంది మాళవిక. నన్ను ముసలిదాన్ని అంటావా నీ చేతులు బాగా పండటం కాదు బాగా మంట పుట్టిస్తాను అని కసిగా అనుకుంటుంది సులోచన. తర్వాత సులోచనని  కుశల ప్రశ్నలు వేస్తారు వేద వాళ్ళు.
 

510

అప్పుడే అక్కడికి వచ్చిన వసంత్ ఎక్కడికి వెళ్ళిపోయావు చిత్ర.. నిన్నే వెతుకుతున్నాను అంటాడు. నేను కూడా నీకోసమే వెతుకుతున్నాను అంటూ మెహంది చూపిస్తుంది చిత్ర. తల్లి చేతులకి ఉన్న గోరింటాకును చూసి నీకు ఎవరు పెట్టారు అంటుంది ఖుషి. మీ నాన్న పెట్టారు అనటంతో తండ్రిని హగ్ చేసుకుని మా మంచి డాడీ మా మమ్మీ ని బాగా చూసుకుంటాడు అంటుంది.

610

అది చూసి.. నా కూతురు కుటుంబం ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలి అని మనసులో అనుకుంటుంది సులోచన. ఆ తర్వాత సులోచన వెళ్లి వాటర్ లో పంచదార కాకుండా వంట సోడా కలిపేస్తుంది. అది తెలియక మాళవిక ఫ్రెండ్ మాళవిక చేతులకి ఆ వాటర్ అప్లై చేస్తుంది. కాసేపటి తర్వాత చేతిలో మంట పుట్టడం ప్రారంభిస్తుంది. మంటకి తను చేసే హడావుడికి అందరూ అక్కడికి వస్తారు.
 

710

ఎవరో కావాలనే చేశారు నేను సంతోషంగా ఉండటం వాళ్ళకి ఇష్టం లేదు అంటూ సులోచన వైపు చూస్తుంది మాళవిక. నా వైపు చూస్తావేంటి అంటూ గొడవకి దిగుతుంది సులోచన. నువ్వు వచ్చిన తర్వాతే ఇదంతా జరిగింది అంటుంది మాళవిక. మా అమ్మని అంటావేంటి అంటూ తల్లిని వెనకేసుకొస్తుంది వేద. వసంత్ కూడా గొడవలు ఏమి పెట్టుకోవద్దు అని మాళవిక ని హెచ్చరిస్తాడు.
 

810

మంచి పని అయింది మాలిని వదిన ఉంటే పండగ చేసుకునేది అని మనసులో అనుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది సులోచన. మరోవైపు ఫోన్ మాట్లాడుతున్న చిత్ర దగ్గరికి వచ్చి మన పెళ్లి సంగతి అందరికీ చెప్తున్నావా అని అడుగుతాడు అభి. నీకు నాకు పెళ్లి ఏంటి మళ్లీ అలా మాట్లాడితే ఊరుకునేది లేదు అంటూ గట్టిగా మాట్లాడుతుంది చిత్ర.

910

నిన్న మొన్నటి వరకు సైలెంట్ గా ఉండే దానివి ఇప్పుడేంటి నాగుపాము లాగా బుసలు కొడుతున్నావు అంటాడు అభి. ఒకటే కుటుంబం కదా ఈరోజు కాకపోతే రేపైనా మారుతాడు.. గొడవలు ఎందుకు అని ఊరుకున్నాను కానీ ఇక మీదట ఊరుకోను ఈ సంగతి అందరికీ చెప్పేస్తాను అంటుంది చిత్ర. నీకు ఒకటి చూపిస్తాను చూపించిన తర్వాత అప్పుడు మాట్లాడు అంటూ ఒక వీడియో చూపిస్తాడు అభి.

1010

ఒక్కసారిగా షాక్ అయిపోతుంది చిత్ర. ఒక ఆడపిల్ల స్నానం చేస్తుండగా వీడియో తీయటానికి నీకు సిగ్గుగా లేదా దయచేసి నా బతుకు బజార్లో పెట్టొద్దు అంటూ బ్రతిమాలుకుంటుంది. ఇంత కష్టపడి ఈ వీడియో సేకరించింది నిన్ను వదిలేయడానికి కాదు. పెళ్లికి 20 నిమిషాల ముందు నువ్వే నా గదికి రావాలి. లేదంటే ఏం జరుగుతుందో తెలుసు కదా అంటూ బెదిరించి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు అభి. ఏడుస్తూ కూర్చుండిపోతుంది చిత్ర. తరువాయి భాగంలో మీకు పిచ్చి పట్టింది అని భర్తతో చెప్తుంది వేద. అవును నీ పిచ్చే అంటాడు యష్.

click me!

Recommended Stories