హింసే మార్గం, కత్తి పట్టిన నాగబాబు... ఇది కదా మనకు కావాల్సింది, రెచ్చిపోతున్న జనసైనిక్స్!

Published : May 15, 2023, 11:10 AM IST

మెగా బ్రదర్ నాగబాబు కత్తిపట్టాడు. ధర్మం, న్యాయం విఫలం చెందిన చోట హింసే మార్గం. దాంతోనే న్యాయం చేయగలం అంటున్నారు.   

PREV
16
హింసే మార్గం, కత్తి పట్టిన నాగబాబు... ఇది కదా మనకు కావాల్సింది, రెచ్చిపోతున్న జనసైనిక్స్!
Nagababu

నటుడు, జనసేన నాయకుడు నాగబాబు సడన్ గా కత్తి పట్టాడు. ఒక వైలెంట్ కొటేషన్ కొట్టాడు. వేట కొడవలి పట్టిన నాగబాబు తీవ్రవాదం తాలూకు కామెంట్స్ చేస్తున్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. నాగబాబు తీరు విమర్శలపాలవుతుంది. ఇంస్టాగ్రామ్ లో కత్తి పట్టుకున్న ఫోటో పెట్టిన నాగబాబు... మంచి అనేది విఫలం చెందినప్పుడు న్యాయం, శాంతి సాధించడానికి హింసే మార్గం, అని కామెంట్ పెట్టారు. 
 

26
Nagababu

నాగబాబు కామెంట్ రెచ్చగొట్టే విధంగా ఉంది. ఇలాంటి వ్యాఖ్యలు పబ్లిక్ లో చేయడం నేరమని కొందరుహితవు పలుకుతున్నారు.. జన సైనికులు మాత్రం ఆవేశానికి గురవుతున్నారు. ఇది కదా మనకు కావాల్సింది. మీరు తగ్గొద్దు మీ వెనుక మేమున్నాం అని నాగబాబుకు హామీ ఇస్తున్నారు. 
 

36


సాధారణంగా పవన్ ఫ్యాన్స్ కి అత్యంత ఆవేశపరులనే పేరుంది. ఒక స్థాయిలో ఉన్న నాగబాబు ఇలాంటి కామెంట్స్ చేయడం దారుణ పరిణామాలకు దారితీసే అవకాశం ఉంది. నాగబాబు పోస్ట్ పొలిటికల్ వార్ కి కారణమైంది. ఆ పోస్ట్ క్రింద ఉన్న కామెంట్స్ పరిశీలిస్తే ఈ విషయం అర్థం అవుతుంది. 
 

46
Nagababu - Pawan Kalyan

నాగబాబు జనసేన పార్టీ ప్రధాన నాయకుల్లో ఒకరు. జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ. నాగబాబు బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నారు. ఇంత పరుష వ్యాఖ్యలు చేయడం వలన విమర్శలపాలు కావాల్సి వస్తుంది. నాగబాబు ఇంత పెద్ద వైలెంట్ పోస్ట్ ఎందుకు పెట్టాడనేది దుమారం రేపుతోంది. నాగబాబు దుందుడుకు స్వభావం పలుమార్లు విమర్శలపాలైంది. 
 

56
Pawan Kalyan

నాగబాబు ప్రస్తుతం జనసేన పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు. ఆయన సినిమాలు తగ్గించారు. వైసీపీ నాయకుల మీద తన మార్కు ఆరోపణలతో టార్గెట్ చేస్తూ ఉంటారు. నాగబాబు పొలిటికల్ కామెంట్స్ అపుడప్పుడు జనసైనికులకు కూడా కోపం తెప్పిస్తుంటాయి. రామోజీరావుకు మద్దతుగా నాగబాబు ట్వీట్ వేయగా జనసైనికులు ఆయన్ని తిట్టిపోశారు.

66

తాజాగా కత్తి పట్టిన వ్యవహారం హాట్ టాపిక్ అవుతుంది. ఇది ఏదైనా సినిమా ప్రమోషన్స్ లో భాగం కావచ్చు. లేదా ఏపీలో జనసేన నాయకులపై జరుగుతున్న దాడులపై ఈ విధంగా స్పందించి ఉండొచ్చు. అయితే ఒక కీలక నేత న్యాయం కోసం కత్తి పట్టండని చెప్పడం దారుణ పరిమాణం... 
 

Read more Photos on
click me!

Recommended Stories