బిగ్ బాస్ తెలుగు 7... ఈ కంటెస్టెంట్ల రేంజ్ ఇప్పుడెలా ఉందో తెలుసా?

Published : Dec 18, 2023, 03:41 PM IST

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 కంటెస్టెంట్లుగా అలరించిన ఆట సందీప్, శుభశ్రీ తదితరులు టైటిల్ సాధించలేకపోయారు. కానీ హౌజ్ నుంచి బయటికి వచ్చాక ఇండస్ట్రీ నుంచి మంచి ఆఫర్లు అందుకుంటున్నారు. ప్రస్తుతం వాళ్ల రేంజ్ లో ఉందో చూద్దాం...

PREV
16
బిగ్ బాస్ తెలుగు 7... ఈ కంటెస్టెంట్ల రేంజ్ ఇప్పుడెలా ఉందో తెలుసా?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 కంటెస్టెంట్లుగా అలరించిన ఆట సందీప్, శుభశ్రీ తదితరులు టైటిల్ సాధించలేకపోయారు. కానీ హౌజ్ నుంచి బయటికి వచ్చాక ఇండస్ట్రీ నుంచి మంచి ఆఫర్లు అందుకుంటున్నారు. ముందుగా బోలే షావలి తన జీవితం ఇప్పుడు అద్భుతంగా ఉందన్నారు. బోలే అంటే హీరో అని, హీరో అంటే బిగ్ అంటూ స్టేట్ మెంట్ ఇచ్చారు. సింగర్ గా మంచి  అవకాాశాలు ఉన్నాయన్నారు. 

26

కొరియోగ్రాఫర్ ఆట సందీప్ (Aata Sandeep)  తన డ్యాన్స్ తో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఆట డాన్స్ షోతో ఫేమ్ అయ్యాడు. తర్వాత పలు రకాలు సోషల్ మీడియాలో ఆకట్టుకుంటూనే వస్తున్నాడు. ఇక తాజాగా Bigg Boss Telugu 7 కంటెస్టెంట్ గా అలరించారు. మధ్యలోనే ఎలిమినేట్ అయ్యారు. మళ్లీ నిన్నటి గ్రాండ్ ఫినాలే సెలబ్రేషన్స్ ను హాజరైన సందీప్ తనకున్న అవకాశాలను వెల్లడించారు. రీసెంట్ గా విడుదలైన Animal  లో ఓసాంగ్ ను కొరియోగ్రఫీ చేసినట్టు తెలిపారు. మరిన్ని సినిమాలు చేస్తున్నానన్నారు. పైగా నాగార్జున కూడా తన ఫ్యూచర్ సినిమాలకూ కొరియోగ్రఫీ చేసేలా హామీనిచ్చాడు. 
 

36

మరో కంటెస్టెంట్ శుభ్ర శ్రీ  (Shubha Sree)  గ్రాండ్ ఫినాలేలో బిగ్ న్యూస్ ను రివీల్ చేసింది. బిగ్ బాస్ హౌజ్ ను వెళ్లిపోయాకా తనకు ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - సుజీత్ కాంబోలోని OGలో అవకాశం వచ్చిందని తెలిపింది. పవన్ పక్కనే నటించే ఛాన్స్ రావడం సంతోషంగా ఉందని తెలిపింది. మరిన్ని ఆఫర్స్ కూడా ఉన్నాయని తెలిపారు.
 

46

యూట్యూబర్ గా ఫేమ్ అయ్యి బిగ్ బాగ్ సీజన్ 7లో కంటెస్టెంట్ గా ఎంపికైన టేస్టీ తేజా (Tasty Teja) కూడా తనకు అందించిన ఆఫర్ల గురించి ఓపెన్ అయ్యారు. తను హౌజ్ నుంచి వెళ్లిపోయాక ఏకంగా 15 సినిమా ఆఫర్లు అందాయన్నారు. తన రెమ్యూనరేషన్ కు రెండింతలు గ్రాండ్ ఫినాలే వరకే సంపాదించినట్టు చెప్పుకొచ్చారు. 

56

సింగర్ దామిని (Singer Damini)   కూడా మంచి ఆఫర్లను దక్కించుకుంటోందని చెప్పారు. సింగర్ గా తనకు గతంతో పోల్చితే మంచి ప్రాధాన్యత కనిపిస్తోందంటూ చెప్పుకొచ్చింది. ‘బాహుబలి’లో ‘పచ్చబొట్టేసినా సాంగ్ పాడి మంచి క్రేజ్ దక్కించుకుంది. బిగ్ బాస్ తెలుగు 7తో మరింత క్రేజ్ దక్కించుకుంది. 

66

బిగ్ బాస్ తెలుగు 7 రన్నరప్ గా నిలిచిన అమర్ దీప్ (Amardeep)   కూడా మంచి అవకాశాలు కనిపిస్తున్నారు. ఇక బిగ్ బాస్ వేదికగా మాస్ మహారాజా రవితేజ హామీనిచ్చారు. తన సినిమాలో తప్పకుండా రోల్ ఉంటుందని చెప్పారు. ఇక అమర్దీప్ రవితేజ కోసం ఏకంగా టైటిల్ నే వద్దనుకొని బిగ్ బాస్ హౌజ్ నుంచి బయటికి వచ్చేందుకు సిద్ధపడటం ఆసక్తికరంగా మారింది.

Read more Photos on
click me!

Recommended Stories