బిగ్ బాస్ హౌస్లో పల్లవి ప్రశాంత్ ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. అతడు పెరిగిన వాతావరణానికి బిగ్ బాస్ వేరే ప్రపంచం వంటిది. కొత్త మనుషులు, అది కూడా సెలెబ్రిటీలతో కలిసి పోయి, యుద్ధం చేసి విజయం సాధించాడు. ఈ క్రమంలో ప్రశాంత్ అవమానాలు కూడా ఎదుర్కున్నాడు. ఆత్మవిశ్వాసం దెబ్బతీయాలని చూసినా వెనకాడలేదు. టైటిల్ కొట్టి విమర్శించిన వాళ్ళ నోళ్లు మూయించాడు.