అంతే కాకుండా.. బిగ్ బాస్ తెలుగు 7 గ్రాండ్ ఫినాలే అనంత హైదరాబాద్ లోని ఆర్టీసీ బస్సులకు డ్యామేజీ అయ్యిందంటూ టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ స్జజ్జనార్ కూడా అసహనం వ్యక్తం చేశారు. బస్సులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంటుందని.. నాగార్జున, స్టార్ మాను ట్యాగ్ చేస్తూ జరిగిన విషయాన్ని చెప్పుకొచ్చారు. ఓవైపు రైతు బిడ్డ, భూమి బిడ్డ పల్లవి ప్రశాంత్ ను విజేతగా నిలిపి ప్రశంసిస్తే.. ఫ్యాన్స్ ఇలా చేయడం ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా పల్లవి ప్రశాంత్ కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.