అక్కినేని నాగ చైతన్య చివరగా నటించిన థాంక్యూ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణమైన పరాజయంగా నిలిచింది. తన నెక్స్ట్ మూవీతో ఎలాగైనా మంచి విజయం అందుకోవాలనే పట్టుదలతో చైతు ఉన్నాడు. ప్రస్తుతం నాగ చైతన్య తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో 'కస్టడీ' అనే చిత్రంలో నటిస్తున్నాడు. థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కుతున్న ఈ మూవీపై మంచి అంచనాలు ఉన్నాయి.