అమీర్‌ ఖాన్‌ తెలుగు సినిమా కన్ఫమ్‌ ? మహేష్‌ డైరెక్టర్‌కి గ్రీన్‌ సిగ్నల్‌

Published : Apr 15, 2025, 01:23 PM ISTUpdated : Apr 15, 2025, 01:28 PM IST

Aamir Khan: బాలీవుడ్‌ మిస్టర్‌ పర్‌ఫెక్ట్ అమీర్‌ ఖాన్‌కి తొమ్మిదేళ్లుగా హిట్‌ లేదు. ఆయన చివరగా `దంగల్‌` చిత్రంతో విజయాన్ని అందుకున్నారు. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా సుమారు రెండు వేల కోట్లు వసూలు చేసింది. ఇండియన్‌ మూవీస్‌లో అత్యధిక వసూళ్లని రాబట్టిన మూవీగా నిలిచింది. ఆ తర్వాత ఐదారు సినిమాలు చేశారు అమీర్‌ కానీ ఏదీ హిట్‌ కాలేదు. వరుస ప్రయత్నాలన్నీ బెడిసి కొట్టాయి. ఈ క్రమంలో అమీర్‌ ఖాన్‌ కి కచ్చితంగా ఒక హిట్‌ కావాలి, ఆయన కమ్‌ బ్యాక్‌ కావడానికి సాలిడ్‌ మూవీ కావాలి. ఇప్పుడు అదే పనిలో ఉన్నారట. 

PREV
14
అమీర్‌ ఖాన్‌ తెలుగు సినిమా కన్ఫమ్‌ ? మహేష్‌ డైరెక్టర్‌కి గ్రీన్‌ సిగ్నల్‌
aamir khan

Aamir Khan: అమీర్‌ ఖాన్‌ కి సక్సెస్‌ పడి చాలా కాలం అవుతుంది. `దంగల్‌` తర్వాత నాలుగు సినిమాలు ఫ్లాప్‌ అయ్యాయి. ఈ క్రమంలో ఇప్పుడు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. తాజాగా ఆయన మూడు సినిమాలతో బిజీగా ఉన్నారు.

అందులో ఒకటి సౌత్‌ సినిమా `కూలీ` ఉంది. రజనీకాంత్‌, నాగార్జున, ఉపేంద్ర నటిస్తున్న ఈ చిత్రంలో గెస్ట్ రోల్‌ చేస్తున్నారు అమీర్‌ ఖాన్‌. క్లైమాక్స్ లో ఆయన కనిపిస్తారట. దీనికి లోకేష్‌ కనగరాజ్‌ దర్శకుడు. 
 

24
aamir khan

దీంతోపాటు హిందీలో `సితారే జమీన్‌ పర్‌` అనే మూవీ చేస్తున్నాడు. అలాగే `లాహోర్‌ 1947` అనే మూవీలో కూడా నటిస్తున్నారు. ఇవి చిత్రీకరణ దశలో ఉన్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో సౌత్‌ మూవీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారట. తెలుగులో సినిమా చేయబోతున్నారట.

34
vamshi paidipally

తెలుగు స్టార్‌ డైరెక్టర్‌ వంశీపైడిపల్లికి ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. ఇటీవల ఆయన ఒక లైన్‌ చెప్పగా ఆసక్తి చూపించారట అమీర్‌. ఆ తర్వాత పూర్తి స్క్రిప్ట్ కావాలని అడగ్గా, కొంత గ్యాప్‌తో ఫుల్‌ నేరేషన్‌ ఇచ్చారని, అమీర్‌ ఖాన్‌ ఎగ్జైటింగ్‌గా ఉన్నాడని అంటున్నారు.  వంశీ.. మహేష్‌ తో `మహర్షి` మూవీని రూపొందించిన విషయం తెలిసిందే. 

44
dil raju

ఈ మూవీని దిల్‌ రాజు నిర్మించబోతున్నారట. ఆయనే ఈ ప్రాజెక్ట్ సెట్‌ చేసినట్టు సమాచారం. గత కొన్ని రోజులుగా దిల్‌ రాజు ఓ బిగ్‌ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేయబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. అది ఇదే అని సమాచారం. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

ఇక వంశీ పైడిపల్లి చివరగా విజయ్‌ తో `వారసుడు` మూవీని రూపొందించిన విషయం తెలిసిందే. దీనికి దిల్‌ రాజే నిర్మాత. ఇప్పుడు అమీర్‌ ఖాన్‌ తో చేయబోతుండటం విశేషం. పాన్‌ ఇండియా మూవీగా దీన్ని ప్లాన్‌ చేస్తున్నట్టు సమాచారం. 

read more: కాలేజీలో దేవుడుగా పిలిపించుకున్న స్టార్‌ హీరో ఎవరో తెలుసా? తెలుగు సినిమాల్లో ఆయనో ట్రెండ్‌ సెట్టర్‌

also read: సమంత లక్కీ హీరో ఎవరో తెలుసా? తెలుగు స్టార్‌ హీరోలు, డైరెక్టర్లకి పెద్ద షాక్‌
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories