Nani HIT-3: హిట్‌-3లో చాగంటి ప్రవచనాలు.. ఈ వైలెన్స్‌లో ఆయన పాత్రపై నాని హాట్‌కామెంట్స్!

Published : Apr 15, 2025, 10:50 AM IST

Nani HIT-3: నేచురల్ స్టార్ నాని హిట్‌-3 సినిమాతో అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పటి వరకు తీసిన సినిమాలకంటే భిన్నంగా ఇందులో కనిపించబోతున్నాడు. సినిమా క్రైమ్ థ్రిల్లర్‌ అనుభూతిని ఇస్తుందని కనిపిస్తోంది. తాజాగా చిత్ర యూనిట్‌ ట్రైలర్‌ను విడుదల చేసింది. ఇందులో నాని క్యారెక్టర్‌ ఊరమాస్‌గా ఉంది. యాంగ్రీ కాప్‌గా నాని కనిపిస్తున్నారు. ట్రైలర్‌ ఆసక్తికరంగా ఉంది. ఈ సందర్బంగా మూవీ యూనిట్‌ మీడియాతో చిట్‌ చాట్‌ నిర్వహించారు. ఇలాంటి వైలెన్స్‌ ఎక్కువగా ఉండే సినిమాలో ప్రవచనాలు చెప్పే చాగంటి కోటేశ్వరరావు ఎందుకు ఇరికించారు.. అని ఓ విలేకరి ప్రశ్నించారు.. దీనిపై నాని ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. 

PREV
15
Nani HIT-3: హిట్‌-3లో చాగంటి ప్రవచనాలు.. ఈ వైలెన్స్‌లో ఆయన పాత్రపై నాని హాట్‌కామెంట్స్!
Nanis Hit 3 upcoming film update out

నాని ప్రతి సినిమాలో మంచి కంటెంట్‌ అందిస్తారని తెలుగు ప్రేక్షకులకు నమ్మకం ఉంది. ఒకటి రెండు సినిమాలు ఆడకపోయినా.. కథలో కొన్ని ఎలిమెంట్స్‌ ఆడియన్స్‌కి నచ్చుతాయి. నాని నటిస్తున్నాడు అంటే మినిమం గ్యారెంటీ సినిమాగా ప్రేక్షకులు భావిస్తున్నారు. అయితే.. ఇప్పటివరకు సరదాపాత్రలు, కామెడీ, కొన్నిసార్లు సీరియస్‌ పాత్రలు చేసినా.. తాజాగా నటిస్తున్న సినిమాలో వైలెంట్‌ లుక్‌లో నాని కనిపిస్తున్నారు. అయితే.. ఉద్దేశపూర్వకంగా సినిమాలో వైలెన్స్‌ ఉండదని కథకు తగ్గట్లుగానే ఆయా సన్నివేశాలు ఉంటాయన్నారు. సినిమా చూసిన తర్వాత ఇందులో వైలెన్స్‌ ఉన్నట్లు ఎవరూ అనుకోరని నాని చెబుతున్నారు.

25
Hit 3 Teaser:

ఇక హిట్‌-3 సినిమా ట్రైలర్‌ లాంచ్‌ చేసింది మూవీ యూనిట్‌.. అందులో ప్రవచనకర్త, ఆధ్యాత్మిక వేత్త, ఏపీ ప్రభుత్వ సలహాదారు చాగంట్‌ కోటేశ్వరరావు ప్రవచనాలను పెట్టారు. ట్రైలర్‌ చూసిన తర్వాత.. సినిమా ప్రారంభం నుంచి చాగంటి మాటలు కథలోకి ప్రేక్షకులను తీసుకెళ్లేందుకు జోడించినట్లు తెలుస్తోంది. అయితే.. ఈ సినిమాలోని వైలెన్స్‌ని హీరో ధర్మం కోసం చేస్తున్నట్లు చాగంటి మాటలతో జస్టిఫై చేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది.  

35
hit 3 movie, nani

ట్రైలర్‌లో చాగంటి మాటలు ఇలా ఉన్నాయి. ''ఆపదలో ఉన్న వారిని రక్షించడానికి యోధుడు ప్రవేశిస్తాడు.. ఒక్క ప్రాణాన్ని కాపాడటానికి ఎన్నో అహోరాత్రులు కష్టపడతాడో.. ఆయనకు మాత్రమే తెలుస్తుంది అని అంటారు. మరో సందర్బంలో ''ఇన్ని పరీక్షలకు తట్టుకుని నిగ్గుతేలగలిగిన శక్తి ఉన్నవాడు తప్పా.. ధర్మసంస్థాపనానికి, ధర్మపరిరక్షణ వైపు అడువేయలేడు అని హీరో నాని ధైర్య సాహసాలను ఉద్దేశించి మాట్లాడారు చాగంటి. 
       

45
chaganti koteswara rao

చాగంటి ప్రవచనాలు సినిమాలో వాడటంపై హీరో నాని స్పందించారు. ఈ సినిమాలో చాగంటి మాటలు చాలా కనెక్టివిటీగా ఉంటాయన్నారు. ఆయన చెప్పిన ప్రతి మాటలో లోతైన అర్థం ఉంటుందని నాని అన్నారు. ఈ సినిమా కోసం చాగంటి ఎప్పుడో డైలాగులు తాము వాడలేదన్నారు. సినిమా కథ ఇలాగుంటుందని డైరెక్టర్‌ చాగంటికి నెరేట్‌ చేసి కథకు తగ్గట్లు ఆయనతో డైలాగులు చెప్పించినట్లు నాని చెబుతున్నారు. అయితే.. కచ్చితంగా చాగంటి ప్రవచనాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయంటున్నారు నాని.

 

55
hit 3 movie, nani

నాని నటిస్తున్న ఈ ఏ సర్టిఫికేట్‌ హిట్‌-3లో చాగంటి వంటి ఆధ్యాత్మిక ప్రవచనకర్త మాటలు చెప్పడం జరిగిందంటే.. ఈ కథలో ఏదో ఆసక్తికర అంశం... సమాజానికి మంచి సందేశం ఉందని అర్థం అవుతోంది. ఇక మే 1న సినిమా విడుదల చేయనున్నట్ల చిత్ర యూనిట్‌ చెబుతోంది. ప్రస్తుతం ఇంకా ఎడిటింగ్‌, ఇతర పనులు శరవేగంగా జరుగుతున్నట్లు డైరెక్టర్‌ చెబుతున్నారు. 

Read more Photos on
click me!