Superstar Krishna : తొలితరం హీరోల్లో దేవుడిగా కొలవబడ్డారు ఎన్టీ రామారావు. ఆయన కృష్ణుడు, రాముడు పాత్రలు వేస్తే నిజంగానే కృష్ణుడు ఇలా ఉంటాడా? రాముడు ఇలా ఉంటాడా? అన్నట్టుగా జనం కొలిచారు. కానీ రియల్ లైఫ్‌లోనూ దేవుడుగా పిలిపించుకున్నారు ఒక హీరో. ఆయన ఎవరో కాదు సూపర్ స్టార్ కృష్ణ. ఆయన సినిమాల్లోకి రాకముందే దేవుడిగా పిలిపించుకోవడం విశేషం. ఆ విషయాలను బయటపెట్టారు సీనియర్ నటుడు మురళీ మోహన్. మరి ఆ కథేంటో చూద్దాం.
Superstar Krishna : సూపర్ స్టార్ కృష్ణ నిర్మాతల పాలిట దేవుడిగా భావిస్తారు. తనతో సినిమాలు చేసి నష్టపోయిన నిర్మాతలకు ఆయన ఎప్పుడూ అండగా ఉంటాడు. వారికి పారితోషికం రిటర్న్ ఇచ్చి సేవ్ చేయడమో గానీ, లేదంటే మరో సినిమా చేసి గట్టెక్కించడమో గానీ చేస్తుంటారు.
ఈ విషయాన్ని చాలా మంది నిర్మాతలు వెల్లడించారు. నిర్మాతల పాలిట ఆయన్ని దేవుడిగా భావిస్తారు. కానీ ఆయన సినిమాల్లోకి రాకముందే ఏకంగా కాలేజీ రోజుల్లోనే దేవుడిగా పిలిపించుకోవడం విశేషం.
24
Superstar Krishna, mahesh babu
కృష్ణని ఇంజనీర్‌ని చేయాలని వారి పేరెంట్స్ అనుకున్నారట. అందుకే ఆయన్ని ఇంటర్లో ఎంపీసీలో చేర్పించారు. తెనాలిలో తాను అనుకున్న గ్రూప్ లేకపోవడంతో ఏలూరికి వచ్చాడట. అక్కడ మురళీమోహన్ చదువుకునే కాలేజీలోనే కృష్ణ కూడా చేరాడు.
అప్పట్లోనే కృష్ణ తెల్లగా మెరిసిపోయేవాడట. ముట్టుకుంటే మాసిపోతాడేమో అన్నట్టుగా ఆయన కనిపించేవాడట. డ్రెస్ కూడా అలానే ఉండేదట. పూర్తి వైట్ అండ్ వైట్ వేసేవాడట, కొంచెం కూడా మడత పడకుండా ఉండేదట.
34
murali mohan
కాలేజీలో ఎవరితోనూ మాట్లాడేవాడు కాదట. కానీ ఆయన కోసం స్టూడెంట్స్ అంతా ఎగబడేవాడట. అమ్మాయిలే కాదు, అబ్బాయిలు కూడా ప్రేమిద్దాం అనేంత అందంగా కృష్ణ ఉండేవారట. ఎవరితోనూ మాట్లాడకపోయే సరికి అంతా కలిసి ఒక నిక్ నేమ్ పెట్టారట. `దేవుడు` అని పిలిచేవారట. అరేయ్ దేవుడు వచ్చాడా? అని మాట్లాడుకునేవాళ్లమని తెలిపారు మురళీ మోహన్.
ఆయన్ని చూడ్డానికి అదిరిపోయావ్ సినిమాల్లోకి వెళ్లొచ్చు కదా అనేవారట. ఆ తర్వాత కృష్ణకి కూడా ఆ ఫీలింగ్ కలిగింది. నెమ్మదిగా సినిమాల్లోకి వచ్చారు అని తెలిపారు మురళీ మోహన్. ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే షోలో ఈ విషయాన్ని వెల్లడించారు.
44
superstar krishna
సూపర్ స్టార్ కృష్ణ.. తాను చదువుకునే కాలేజీకి ఓ సారి ఏఎన్నార్ గెస్ట్ గా వచ్చారు. ఆయన్ని చూసి స్టూడెంట్స్ అంతా ఎగబడ్డారు. ఒక హీరో కోసం ఇంత మంది ఎగబడతారా? అని భావించి తాను కూడా హీరో అవ్వాలనుకున్నాడట. అలా మద్రాస్ వెళ్లి ప్రయత్నాలు మొదలు పెట్టాడు.
తన అభిమాన హీరో ఎన్టీఆర్‌ని కూడా కలిసి వేషం అడిగాడట. అప్పటికే కృష్ణ కుర్రాడిగా ఉన్నాడు. మరో రెండేళ్లు ఆగి రావాలని సూచించాడట రామారావు. ఆ తర్వాత `తేనే మనసులు` సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు కృష్ణ. ఇక తిరుగులేని సూపర్ స్టార్‌గా ఎదిగిన విసయం తెలిసిందే.