ఛత్రపతి చిత్రం తర్వాత ప్రభాస్ కి అగ్ని పరీక్ష ఎదురైంది. ఛత్రపతి తర్వాత ప్రభాస్ ఎలాంటి చిత్రం చేసినా వర్కౌట్ కావడం లేదు. పౌర్ణమి, యోగి, మున్నా, బుజ్జిగాడు, ఏక్ నిరంజన్ ఇలా అన్ని చిత్రాలు డిజాస్టర్ అవుతున్నాయి. మధ్యలో బిల్లా మాత్రం మాస్ యాక్షన్ అంశాలతో పర్వాలేదనిపించింది కానీ హిట్ లిస్టులో చేరలేదు. ఆ టైంలో ప్రభాస్ గేరు మార్చి ఫ్యామిలీ లవ్ స్టోరీ కథని ఎంచుకున్నారు. ఆ చిత్రమే డార్లింగ్. కరుణాకరన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది.