WAVES సమ్మిట్‌లో ఆమిర్ ఖాన్ వేసిన ప్రశ్నకు అంతా షాక్ అయ్యారు. ఇండియాలో సినిమా థియేటర్ల కొరతపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. చైనాలో 90,000, అమెరికాలో 40,000 స్క్రీన్లు ఉండగా, ఇండియాలో కేవలం 10,000 మాత్రమే ఉన్నాయని, దీనివల్ల సినీ పరిశ్రమ అభివృద్ధికి ఆటంకం కలుగుతోందని ఆయన అన్నారు.
Waves Summit 2025 : ఇండియాలో థియేటర్ల సంఖ్య తగ్గడంపై బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ ఆందోళన వ్యాక్తం చేశారు. ఇండియా సినిమా ప్రియుల దేశమని, కానీ చాలా మంది థియేటర్లకు వెళ్ళే అవకాశం లేదని అన్నారు.
27
WAVES సమ్మిట్‌లో ఆమిర్ ఖాన్
WAVES సమ్మిట్ రెండో రోజున "Studios of the Future: Putting India on the World Studio Map" అనే సెషన్‌లో దంగల్ నటుడు పాల్గొన్నారు. ఇండస్ట్రీ అభివృద్ధికి మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు అవసరమని ఆమిర్ అన్నారు.
37
ఆమిర్ ఖాన్
ఇండియాలో మరిన్ని థియేటర్లు, విభిన్న రకాల థియేటర్ల అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు. థియేలర సంఖ్య పెరగాల్సి ఉందని నేను భావిస్తున్నాను. దేశంలో చాలా జిల్లాలు, ప్రాంతాల్లో ఇప్పటికీ ఒక్క థియేటర్ కూడా లేదు అని ఆమీర్ అన్నారు.
గత దశాబ్దాల్లో మనం ఎదుర్కొన్న ఇబ్బందులన్నీ ఎక్కువ స్క్రీన్లు లేకపోవడమే. మనం ఇందులోనే పెట్టుబడి పెట్టాలి. స్క్రీన్ల సంఖ్య పెరిగితే సినిమాలు బ్రతుకుతాయి. లేకుంటే పెద్ద సినిమా వచ్చినప్పుడు చిన్న సినిమాలు ఇబ్బందులు పడుతున్నాయి.
57
ఆమిర్ ఖాన్
ఇండియాలో చాలా అవకాశాలున్నాయి, కానీ దేశవ్యాప్తంగా మరిన్ని స్క్రీన్లు ఉంటేనే అవి సాకారమవుతాయి. లేకపోతే, ప్రజలు సినిమాలు చూడలేరు. అని ఆమీర్ ఖాన్ స్పష్టం చేశారు.
67
ఆమిర్ ఖాన్
సినిమా స్క్రీన్ల సంఖ్య విషయంలో ఇండియా అమెరికా, చైనా కంటే చాలా వెనుకబడి ఉందని ఆమీర్ గట్టిగా చెప్పారు. దేశం పరిమాణం, జనాభాతో పోలిస్తే మన దగ్గర చాలా తక్కువ థియేటర్లు ఉన్నాయి. మన దగ్గర దాదాపు 10,000 స్క్రీన్లు మాత్రమే ఉన్నాయి.
77
ఆమిర్ ఖాన్
ఇండియా జనాభాలో మూడో వంతు ఉన్న అమెరికాలో 40,000 స్క్రీన్లు ఉన్నాయి. చైనాలో 90,000 స్క్రీన్లు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు మనకంటే చాలా ముందున్నారు. అని ఆమీర్ ఖాన్ అన్నారు. మరి ఆమీర్ లేవనెత్తిన సమస్యపై పెద్దలు ఏం మాట్లాడుతారో చూడాలి.