లాల్ సింగ్ చద్దా... అద్వైత్ చందన్ డైరెక్ట్ చేసిన ఈసినిమాలో టాలీవుడ్ యంగ్ స్టార్ నాగచైతన్య ముఖ్యమైన పాత్రలో కనిపించారు. ఈ సినిమాతోనే చైతూ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈసినిమా రిలీజ్ చేయాలి అనుకన్నప్పటి నుంచి అమీర్ మీద వ్యాతిరేకతతో బాయ్ కాట్ లాల్ సింగ్ చద్దా అంటూ పెద్దఎత్తున ప్రచారం జరిగింది. మరి ఆ ప్రభావం ఈమూవీపై ఎంత వరకూ పడింది..?
అబ్రడ్స్ లో ఈ మూవీ ప్రీమియర్స్ పడ్డాయి. సినిమా చూసిన ఆడియన్స్ లో కొందరు ట్వీట్ చేస్తూ.. అమిర్ ఖాన్ మళ్ళీ అదరగొట్టాడు అంటున్నారు. సినిమా ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ అని లేకుండా మొత్తాన్ని ఎంజాయ్ చేయోచ్చంటున్నారు.
అంతే కాదు.. కొంత కాలంగా వెనకబడుతూ వచ్చిన బాలీవుడ్ కు.. స్వచ్చమైన గాలితో ఊపిరి పోసిన సినిమా లాల్ సింగ్ చడ్డా అంటున్నారు. సరికొత్త కంటెంట్ లో అమీర్ చేసిన ప్రయోగానికి ఫిదా అవుతున్నారు ప్యాన్స్. అంతే కాదు ఈ సినిమాలో అమీర్ ఖాన్ , కరీనా కపూర్ కెమిస్ట్రీ అద్భుతంగా వర్కైట్ అయ్యిందంటున్నారు.
లాల్ సింగ్ చడ్డా ఎమోషనల్ టచ్ ఇచ్చిన సినిమా అంటున్నారు దుబయ్ లో సినిమా చూసిన ఫ్యాన్స్. ఈ సినిమా తమను ఉక్కిరిబిక్కిరి చేసిందంటున్నారు. ఇంత అద్బుతమైన సినిమా చూసి ఒళ్లు పులకరించిందంటూ కామెంట్ చేస్తున్నారు.
ఇక మరికోందరు మాత్రం సినిమా బాగుంది. ఫస్ట్ హాఫ్ ను ప్లాట్ గా తీసుకెళ్ళి మంచి ఇంటర్వెల్ పాయింట్ ఇచ్చారు. ఇక సెకండ్ హాఫ్ మొత్తం మంచి ఎంటర్టైన్మెంట్ తో పాటు ఎమోషనల్ టచ్ తో ఆకట్టు కున్నారంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక బాలీవుడ్ బెస్ట్ యాక్టర్ అంటే అమీర్ ఖాన్ అంటున్నారు ఫారెన్ ఆడియన్స్.
ఇక ఈసినిమాపై నెగెటీవ్ కామెంట్లు కూడా తప్పడం లేదు. లాల్ సింగ్ చద్దా వరస్ట్ సినిమా అంటూ ఈ సినిమాకు నెగెటీవ్ రివ్యూలు ఇచ్చేవారు కూడా లేకపోలేదు. సినిమాలో ఏం లేదు. మరోసారి అమీర్ మోసం చేస్తున్నాడంటూ.. ట్విట్టర్ లో రకరకాల మీమ్స్. కామెంట్స్ కనిపిస్తున్నాయి.
అయితే ఇదంతా ఓక ఎత్తయితే.. ఈరోజు థియేటర్లలో సందడి చేయబోతోంది లాల్ సింగ్ చడ్డా. మరి మన దగ్గర ఈసినిమపైజరిగిన నెగెటీవ్ ప్రచారంతో.. ఈసినిమాకు ఎంత వరకూ నష్టం ఉంటుంది. ఆడియన్స్ ను ఎంత మేరకు ఆకట్టుకోగలుతుంది తెలియాలంటే.. ఓ రెండు రోజులు ఆగాల్సిందే.