ఆ తర్వాత కెవ్వు కార్తిక్ మ్యాన్ హోల్‌లో పడిపోయే సీన్ నవ్వులు పూయించింది. అనంతరం రాకింగ్ రాకేష్,సుజాత ఎపిసోడ్ నవ్వించింది. దీని తర్వాత `యమలోకం` స్కిట్లు చేశారు రాంప్రసాద్, గెటప్ శ్రీను, ఇమ్మాన్యుయెల్, వర్ష, ఫైమా, రాకేష్, సుజాతలు. వీరిలో గెటప్ శ్రీను యముడిగా చేయగా, రాంప్రసాద్ ఆయన సహాయకుడిగా చేశారు. రాకేష్, సుజాత, ఇమ్మూ, వర్ష, ఇలా వారంతా కింద తప్పులు చేసి చనిపోయి యమలోకానికి వస్తారు. అక్కడ యమధర్మరాజు వారికి శిక్షలు వేయాలని నిర్ణయిస్తాడు.