megastar chiranjeevi
డైరెక్టర్ అనిల్ రావిపూడి, మెగాస్టార్ చిరంజీవి క్రేజీ కాంబినేషన్ సెట్ అయిన సంగతి తెలిసిందే. సంక్రాంతికి వస్తున్నాం లాంటి భారీ హిట్ తర్వాత అనిల్ రావిపూడి చిరంజీవిని డైరెక్ట్ చేయబోతున్నారు. మెగాస్టార్ అద్భుతంగా ఇంప్రెస్ అయిన స్క్రిప్ట్ ఆల్రెడీ లాక్ అయింది అని అనిల్ రావిపూడి ప్రకటించారు. ఉగాది రోజున ఈ చిత్రం పూజా కార్యక్రమంతో లాంచ్ కాబోతోంది.
అయితే హీరోయిన్ల విషయంలోనే సస్పెన్స్ కొనసాగుతోంది. ముందుగా క్రేజీ హీరోయిన్ అదితి రావు హైదరి పేరు వినిపించింది. అనిల్ రావిపూడి ఆమెతో చర్చలు జరిపారట. తాజాగా ఒక బాలీవుడ్ హీరోయిన్ పేరు కూడా వినిపిస్తోంది. గతంలో ఆమె రెండుసార్లు టాలీవుడ్ దర్శకులకు నో చెప్పింది. ఆమె ఎవరో కాదు పరిణీతి చోప్రా. రాజమౌళి ఆర్ఆర్ఆర్ చిత్రంలో సీత పాత్ర కోసం ముందుగా పరిణీతి చోప్రాని అనుకున్నారు.
కానీ తన పాత్ర నిడివి తక్కువగా ఉందని పరిణీతి రిజెక్ట్ చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆర్ఆర్ఆర్ చిత్రం విడుదలై 1100 కోట్లకి పైగా వసూళ్లు సాధించి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అదే విధంగా సందీప్ రెడ్డి వంగా యానిమల్ చిత్రాన్ని కూడా పరిణీతి చోప్రా రిజెక్ట్ చేసింది. దీనితో ఆమె ప్లేస్ లో రష్మిక మందనని ఎంచుకున్నారు. యానిమల్ చిత్రం 700 కోట్లు వసూళ్లు సాధించింది.
అనిల్ రావిపూడి.. చిరంజీవి చిత్రం కోసం పరిణీతి చోప్రాతో కూడా సంప్రదింపులు జరుపుతున్నారట. అయితే చివరికి అదితి రావు, పరిణీతి ఇద్దరిలో ఎవరు ఒకే చెబుతారో తెలియదు. ఆసక్తికర విషయం ఏంటంటే పరిణీతి చోప్రా, అదితి రావు ఇద్దరూ పెళ్ళైన హీరోయిన్లే.