యాక్షన్‌పై మోజు పడ్డ `షష్టిపూర్తి` హీరోయిన్‌, ఫస్ట్ టైమ్‌ అలా కనిపించబోతుందట

Published : May 21, 2025, 07:56 PM IST

సుమంత్‌, నాగార్జునలతో తెలుగు ఆడియెన్స్ ని అలరించిన ఆకాంక్ష సింగ్‌ ఇప్పుడు `షష్టిపూర్తి` చిత్రంతో ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. గ్లిజరిన్‌ వాడకుండానే కన్నీళ్లు పెట్టుకున్న విషయం బయటపెట్టింది. 

PREV
15
`షష్టిపూర్తి`తో తెలుగు ఆడియెన్స్ ముందుకు ఆకాంక్ష సింగ్‌

ఆకాంక్ష సింగ్‌ `మళ్లీరావా`, `దేవదాస్‌` చిత్రాలతో తెలుగులో గుర్తింపు తెచ్చుకుంది. కానీ పెద్దగా సినిమా అవకాశాలు రాలేదు. తమిళం, కన్నడ, హిందీలోనూ మూవీస్‌ చేస్తూ రాణిస్తుంది. చాలా గ్యాప్‌ తో ఇప్పుడు `షష్టిపూర్తి` మూవీతో మళ్లీ తెలుగు ఆడియెన్స్ ని అలరించేందుకు వస్తుంది.

 ఇందులో రాజేంద్రప్రసాద్‌, అర్చన ప్రధాన పాత్రలు పోషించగా, రూపేష్‌, ఆకాంక్ష సింగ్‌ జంటగా నటించారు. పవన్‌ ప్రభ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. మా ఆయి ప్రొడక్షన్స్ పతాకంపై రూపేష్‌ ఈ మూవీని నిర్మించడం విశేషం.  ఈ నెల 30న ఈ మూవీ విడుదల కాబోతుంది.

25
కరోనా వల్ల గ్యాప్‌ వచ్చిందిః ఆకాంక్ష సింగ్‌

ఈ సందర్భంగా ఆకాంక్ష సింగ్‌ బుధవారం మీడియాతో ముచ్చటించింది. ఆసక్తికర విషయాలను పంచుకుంది. తనకు యాక్షన్‌ సినిమాలు చేయాలని ఉందని తెలిపింది. ఇక మొదటిసారి `షష్టిపూర్తి` సినిమాలో ట్రెడిషనల్‌ లుక్‌లో కనిపిస్తున్నట్టు తెలిపింది. 

ఈ మూవీ గురించి ఆమె మాట్లాడుతూ, తెలుగులో చాలా గ్యాప్ తరువాత వస్తున్నా. కరోనా వల్ల నాకు చాలా గ్యాప్ వచ్చింది. హీరో నాని సిస్టర్‌ దీప్తి గంటా తెరకెక్కించిన `మీట్ క్యూట్` చిత్రాన్ని ముందుగా థియేటర్లో రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ చివరకు ఓటీటీలో వచ్చింది.

35
ఫస్ట్ టైమ్‌ ట్రెడిషనల్‌ లుక్‌లో కనిపిస్తాః ఆకాంక్ష సింగ్‌

ఇప్పుడు ‘షష్టి పూర్తి’ సినిమా థియేటర్లోకి రాబోతోంది. ఈ చిత్రం అద్భుతంగా ఉంటుంది. టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌లో ఉంటుంది. ఇళయరాజా సంగీతం అందరినీ మెప్పిస్తుంది. `షష్టి పూర్తి` సినిమాలో జానకి అనే పాత్రలో ఓ గ్రామీణ అమ్మాయిగా, అచ్చమైన తెలుగు అమ్మాయిగా కనిపిస్తాను. టెంపుల్ ట్రెజరర్‌గా నటించాను.  

ఇంత వరకు నేను అచ్చమైన తెలుగమ్మాయిలా కనిపించే పాత్రను పోషించలేదు. లంగావోణిలు కట్టలేదు. ఇందులో అలా కనిపించడం కొత్తగా ఉంది. రాజమండ్రిలో నెల రోజులకు పైగా షూటింగ్ చేశాను.  ఎండల్లో అక్కడ ఎంతో కష్టపడి షూటింగ్ చేశాం. పడవల్లో ప్రయాణం చేశాం. అవన్నీ నాకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. గోదావరి అందాల్ని మరింత అందంగా చూపించారు` అని తెలిపింది ఆకాంక్ష సింగ్‌.

45
నాన్న గుర్తుకొచ్చారుః ఆకాంక్ష సింగ్‌

రాజేంద్రప్రసాద్‌తో వర్క్ చేయడం గురించి చెబుతూ, ఇది వరకు `బెంచ్ లైఫ్` చిత్రంలో   రాజేంద్ర ప్రసాద్ తో నటించాను. మళ్లీ ఈ చిత్రంలో నటించాను. ఆయనతో కలిసి పని చేయడం వల్ల ఎంతో నేర్చుకున్నాను. మేం ఇద్దరం ఎప్పుడు కలిసి నటించినా గ్లిజరిన్ వాడలేదు. సహజంగానే ఎమోషనల్ సీన్స్‌ను రక్తి కట్టించేవాళ్లం. ‘షష్టి పూర్తి’ కోసం పని చేస్తుంటే నాకు యాక్టింగ్ స్కూల్‌కు వెళ్లినట్టుగా అనిపించింది. 

`షష్టి పూర్తి` అనేది కేవలం షష్టి పూర్తి గురించే ఉండదు. అన్ని రకాల అంశాలు ఉంటాయి. నా పాత్రలో ఎన్నో షేడ్స్ ఉంటాయి. మా నిర్మాత రూపేష్ చాలా మంచి వ్యక్తి. సినిమాల పట్ల ఎంతో ప్యాషన్ ఉంది. నటుడిగానే కాకుండా నిర్మాతగానూ ఈ చిత్రానికి న్యాయం చేశారు. మా దర్శకుడు పవన్‌కు ఓ క్లారిటీ, విజన్ ఉంది. ఆయనతో పని చేయడం ఎంతో ఆనందంగా ఉంది. 

ఈ చిత్రాన్ని కుటుంబ సమేతంగా చూడాలి. తల్లిదండ్రుల గురించి గొప్పగా చెప్పే ఈ సినిమాను అందరూ తప్పకుండా చూసి సక్సెస్ చేయండి. ఈ మూవీ కోసం షూటింగ్ చేస్తున్నప్పుడు నా ఫాదర్‌ గుర్తుకు వచ్చారు. నేను ఆయన్ను చాలా మిస్ అయ్యాను. తల్లిదండ్రులతో ఎక్కువ సమయాన్ని గడపండి.వారిని ప్రేమించండి` అని చెప్పింది.

55
యాక్షన్‌ సినిమాలు చేయాలనుందిః ఆకాంక్ష సింగ్‌

తన కెరీర్‌ గురించి ఆకాంక్ష సింగ్‌ మాట్లాడుతూ, `నన్ను ఓ మంచి నటిగానే జనాలు గుర్తు పెట్టుకోవాలని అనుకున్నాను. అందుకే తగ్గట్టుగానే మంచి పాత్రలను, మంచి కథల్ని ఎంచుకుంటూ వచ్చాను. ‘షష్టి పూర్తి’తో నాకు ఇంకా చాలా మంచి పేరు వస్తుందని భావిస్తున్నాను. కథ, పాత్ర నచ్చితే ఓటీటీలో అయినా, వెబ్ సిరీస్‌లో అయినా సరే నటిస్తాను.

 మన పని మనం సక్రమంగా చేసుకుంటూ పోతే అవకాశాలు వాటంతటవే వెతుక్కుంటూ వస్తాయి. నాకు అన్ని రకాల పాత్రలను, జానర్లను టచ్ చేయాలని ఉంది. ప్రధానంగా యాక్షన్ చిత్రాలంటే ఎక్కువగా ఇష్టం. ప్రస్తుతం ఓ యాక్షన్ మూవీని చేస్తున్నాను. అది చాలా బాగా వస్తోంది. తమిళంలో ఇంకో సినిమాను చేస్తున్నా. నాని చిత్రాలు అంటే చాలా ఇష్టం.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories