Aadhi-Nikki Galrani Engagement : పెళ్లి పీటలు ఎక్కనున్న ఆది పినిశెట్టి, నిక్కీ గాల్రానీ.. ఎంగేజ్ మెంట్ పిక్స్

Published : Mar 26, 2022, 06:18 PM IST

కొంత కాలంగా ప్రేమలో మునిగి తేలుతున్న నటుడు ఆది పినిశెట్టి, హీరోయిన్ నిక్కీ గాల్రానీ పెళ్లిపీటలు ఎక్కేందుకు సిద్ధం అయ్యారు. ఈ మేరకు తాజాగా నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. ప్రస్తుతం ఆ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. 

PREV
16
Aadhi-Nikki Galrani Engagement : పెళ్లి పీటలు ఎక్కనున్న ఆది పినిశెట్టి, నిక్కీ గాల్రానీ.. ఎంగేజ్ మెంట్ పిక్స్

ఆది పినిశెట్టి (Aadhi Pinishetty) గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అటు హీరోగానూ, ఇటు ప్రత్యర్థి పాత్రల్లోనైనా ప్రేక్షకులను మెప్పించగల సత్తా ఉన్న నటుడు ఆది. అయితే తాజాగా సమాచారం ప్రకారం ఆది ఓ ఇంటి వాడు కాబోతున్నాడు.  

26

ఫేమస్ డైరెక్టర్ రవిరాజా పినిశెట్టి కొడుకుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఆది. విభిన్న పాత్రల్లో నటించి తనకంటూ స్పెషల్ క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇటు తెలుగు, అటు తమిళ సినిమాల్లోనూ నటించాడు. 
 

36

అయితే తమిళ ఇండస్ట్రీలో పనిచేస్తున్న క్రమంలో మలయాళ హీరోయిన్ నిక్కీ గాల్రానీ (Nikki Galrani)తో పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ కలిసి తమిళంలో  ‘యాగవరాయినుమ్ నా కాక్క’, తెలుగులో ‘మలుపు’ సినిమాలో కలిసి నటించారు. అప్పటికే వీరి పరిచయం కాస్తా ప్రేమగా మారింది.  

46

ఇలా చాలా కాలంగా రిలేషన్‌షిప్‌లో ఉన్న ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీ తాజాగా నిశ్చితార్థం చేసుకున్నారు. సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య  నిశ్చితార్థం చేసుకున్నారు. దీంతో త్వరలో వీరిద్దరూ  పెళ్లి పీటలు ఎక్కి.. తెలుగు ప్రేక్షకులకు స్టార్ కపుల్స్ గా పరిచయం కానున్నారు.  
 

56

ఆది తన కేరీర్ ప్రారంభంలో తొలుత తమిళ సినిమాల్లో నటించినా.. మళ్లీ టాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. నిక్కీ గాల్రానీ హీరో సునిల్ (Sunil) నటించిన ‘కృష్ణాష్టమి’మూవీలో హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రంతో తెలుగు ఆడియెన్స్ కు పరిచయం అయింది. ఆ తర్వాత ఆదితో ‘మలుపు’ చిత్రంలో నటించి.. ప్రస్తుతం మలయాళం, తమిళం సినిమాలే చేస్తోంది. 

66

అయితే వీరిద్దరి నిశ్చితార్థం పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఇటు ఆది పినిశెట్టి, అటు నిక్కీ గాల్రానీ తమ ఎంగేజ్ మెంట్ ఫొటోలను ఇన్ స్టా వేదికన అభిమానులతో పంచుకున్నారు. దీంతో ఫ్యాన్స్ సూపర్ హ్యాపీ ఫీలింగ్ ను వ్యక్తం చేస్తూ.. కామెంట్లలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు.  ప్రస్తుతం ఆది రామ్ పోతినేని (Ram pothineni) నటిస్తున్న ‘ది వారియర్’ మూవీలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ వారు కూడా ఈ జంటకు శుభాకాంక్షలు తెలిపారు.

click me!

Recommended Stories