Aadarsha Kutumbam Review: ఆదర్శ కుటుంబం మూవీ ఫస్ట్ రివ్యూ, వెంకటేష్‌ మూవీలో హైలైట్స్ ఇవే, మైనస్‌ ఏంటంటే?

Published : Oct 29, 2026, 08:49 AM IST

వెంకటేష్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వచ్చిన మొదటి సినిమా `ఆదర్శ కుటుంబం` ఒక్క రోజులో రిలీజ్‌ కాబోతుంది. తాజాగా ఫస్ట్ రివ్యూ రిపోర్ట్ వచ్చింది. మరి ఈ సినిమా హిట్టా, ఫట్టా అనేది చూస్తే.

PREV
15
వెంకటేష్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో మొదటి సినిమా ఆదర్శ కుటుంబం

వెంకటేష్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో ఇప్పటి వరకు సినిమా రాలేదు. అయితే వెంకీ హీరోగా వచ్చిన పలు సూపర్‌ హిట్‌ చిత్రాలకు త్రివిక్రమ్‌ కథ, మాటలు, స్క్రీన్‌ ప్లే అందించారు. కానీ త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వెంకటేష్‌ హీరోగా మాత్రం `ఆదర్శకుటుంబం` (ఏకే 47) తొలి చిత్రం అని చెప్పొచ్చు. `హౌజ్‌ నెంబర్‌ 47` అనేది ట్యాగ్‌లైన్‌. హారికా అండ్‌ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్‌ రాధాకృష్ణ(చినబాబు) నిర్మించారు. ఇందులో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించింది. నివేతా పేతురాజ్‌, నారా రోహిత్ వంటి వారు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం రేపు(అక్టోబర్ 30న) శుక్రవారం విడుదల కానుంది. ఈ క్రమంలో సినిమా ఎలా ఉండబోతుందనే దానికి సంబంధించిన ఫస్ట్ రిపోర్ట్ వచ్చింది. సినిమా ఎలా ఉండబోతుందంటే?

25
ఆదర్శ కుటుంబం సెన్సార్‌ టాక్‌

ముందుగా ఈ చిత్రం ఇటీవలే సెన్సార్‌ పూర్తి చేసుకుంది. `యూ ఏ` సర్టిఫికేట్‌ని పొందింది. 16ఏళ్లపై బడ్డ వారు సినిమాని చూడొచ్చు. మూవీ నిడివి రెండు గంటల 23 నిమిషాలుగా ఉంది. ఇటీవల కాలంలో ఈ నిడివి చాలా డీసెంట్‌ నిడివి అనే చెప్పొచ్చు. సెన్సార్‌ సభ్యుల నుంచి సినిమాకి పాజిటివ్‌ రియాక్షన్ ఉందని సమాచారం. వాళ్లు సినిమాని ఎంజాయ్‌ చేసినట్టుగా చిత్ర బృందం చెబుతోంది. మరి మూవీ కథ ఏంటి? ఇందులో హైలైట్స్ ఏంటి? ఓవరాల్‌గా సినిమా ఎలా ఉండబోతుందనేది చూస్తే.

35
ఆదర్శ కుటుంబం కథ ఇదే

సినిమా కథేంటంటే?.. ఇందులో వెంకటేష్‌ చిట్టిబాబు అనే పాత్రలో కనిపిస్తాడు. ఆయన బ్యాంక్‌ ఎంప్లాయ్. ఆయనకు భార్య శ్రీనిధి శెట్టి. ఆమె స్వర్ణ అనే పాత్రలో కనిపిస్తుంది. వీరికి కూతురు సంపూర్ణ(యువీనా), కొడుకు శర్వ(రాజా ప్రజ్వల్‌) ఉంటారు. మిడిల్‌ క్లాస్‌ ఫ్యామిలీ ఇది. భార్య చిట్‌ఫండ్ పేరుతో చిట్టీల వ్యాపారం చేసి అప్పులు చేస్తుంది. కూతురు ప్రేమలో పడుతుంది. చిట్టిబాబుకి పెద్ద తలనొప్పిగా మారుతుంది. ఇక కొడుకు అల్లరి, చదువు రాదు. దీంతో చిట్టిబాబుకి ఫ్రస్టేషన్‌ పెరిగిపోతుంటుంది. వీరిని భరించడం ఆయనకు తలనొప్పిగా మారుతుంది.

ఇలాంటి పరిస్థితుల్లో ఓరోజు కొందరు దుండుగులు వీరి ఇంటిపై ఎటాక్‌ చేస్తారు. దీన్ని పోలీస్‌ ఆఫీసర్‌ దామోదర్‌ నాయుడు(నారా రోహిత్‌) ఇన్వెస్టిగేట్‌ చేస్తుంటాడు. అయితే అనూహ్యంగా చిట్టిబాబు ఫ్యామిలీ.. విలాసవంతమైన విల్లాలోకి మారిపోతారు. ఇది అందరికి షాకిస్తుంది. అంతేకాదు ఆ తర్వాత లెక్కలన్నీ మారిపోతాయి. ఫ్యామిలీ మ్యాన్ గా, ఇన్నోసెంట్‌గా ఉండే చిట్టిబాబు ఒక్కసారిగా వాయిలెంట్‌గా మారిపోతాడు. సినిమా యాక్షన్‌లోకి వెళ్లిపోతుంది. వారి ఫ్యామిలీ కూడా అలానే కనిపిస్తుంది. మరి ఆ సడెన్‌ మార్పుకి కారణమేంటి? చిట్టిబాబు ఫ్లాష్‌ బ్యాక్‌ ఏంటనేది మిగిలిన సినిమా.

45
ఆదర్శ కుటుంబం మూవీ ఎలా ఉంటుందంటే?

సినిమా ప్రారంభంలో ఫ్యామిలీ ఎలిమెంట్లు, వెంకటేష్‌ ఫ్యామిలీ మధ్య చోటు చేసుకునే సంఘటనలు ఫన్నీగా ఉంటాయట. వారి కష్టాలు ఆడియెన్స్ కి నవ్వులు పూయిస్తాయట. త్రివిక్రమ్‌ మార్క్ డైలాగ్‌లు, కామెడీ సీన్లు నవ్విస్తాయని, ఫస్టాఫ్‌ అంతా సరదాగా సాగిపోతుందని, మధ్య మధ్యలో యాక్షన్‌ సీన్లు వస్తాయని సమాచారం. ఇక ఇంటర్వెల్‌ ట్విస్ట్ తో కథ మొత్తం మారిపోతుందట. సెకండాఫ్ యాక్షన్, థ్రిల్లర్‌గా మారుతుందట. వెంకటేష్‌ పాత్రలోని మార్పు ఆశ్చర్యపరుస్తుందని, సినిమాలో బాగుంటుందని సమాచారం.

ఫస్టాఫ్‌ కామెడీగా ఆకట్టుకుంటుందని, సెకండాఫ్‌ కాస్త స్లో అవుతుందట. యాక్షన్‌ సీన్లు, ఫ్లాష్‌ బ్యాక్‌ సీన్లు కొంత రొటీన్‌గా, బోరింగ్‌గా అనిపిస్తాయట. క్లైమాక్స్ మాత్రం బాగుంటుందని, మైనస్‌లను కవర్‌ చేస్తుందని తెలుస్తోంది. అయితే ఇందులో వెంకటేష్‌, శ్రీనిధి శెట్టి, వారి పిల్లల పాత్రల మధ్య వచ్చే సీన్లు మాత్రం హిలేరియస్‌గా ఉంటాయని, సినిమాకి హైలైట్‌గా నిలుస్తాయని సమాచారం. నివేతా పేతురాజ్‌ లవ్‌ ట్రాక్‌ కూడా ఆకట్టుకుంటుందని, నారా రోహిత్‌ పాత్ర ఎంట్రీ తర్వాత కథ థ్రిల్లర్‌గా, సీరియస్ గా టర్న్ తీసుకుంటుందట.

55
థమన్‌ మరో హైలైట్‌

దీనికితోడు థమన్‌ మ్యూజిక్‌, ఆర్‌ఆర్‌ అదిరిపోతుందని చెబుతున్నారు. బీజీఎం విషయంలో థమన్‌ ఇరగదీశారట. అది మరో హైలైట్‌ అవుతుందని చెబుతున్నారు. కెమెరా వర్క్ బాగుంటుందట. విజువల్‌గా కనువిందుగా ఉంటుందని, ఎడిటింగ్‌ పరంగానూ గ్రిప్పింగ్‌గా ఉంటుందని చెబుతున్నారు. ఓవరాల్‌గా మూవీకి పాజిటివ్‌ టాక్‌ వినిపిస్తోంది. హిట్‌ అయ్యే లక్షణాలు చాలా ఉన్నాయట. మరి అది ఎంతవరకు తెరపై వర్కౌట్‌ అవుతుందనేది చూడాలి. ఒరిజినల్ ఏసియానెట్‌ రివ్యూ కోసం వెయిట్‌ చేయండి.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories