AK 47 Censor Review: ఆదర్శ కుటుంబం సెన్సార్‌ రివ్యూ, రిపోర్ట్ ఏంటి? ఈ మూవీని ఎవరు చూడొచ్చు?

Published : Oct 26, 2026, 05:14 PM IST

వెంకటేష్‌ హీరోగా నటించిన `ఆదర్శ కుటుంబం` విడుదలకు రెడీ అయ్యింది. తాజాగా సెన్సార్‌ రిపోర్ట్ వచ్చింది. ఈ సినిమా నిడివి ఎంత, సినిమా ఎలా ఉంటుంది? దీన్ని ఎవరు చూడొచ్చు అనేది చూస్తే.

PREV
13
ఈ నెల 30న విడుదల కాబోతున్న ఆదర్శ కుటుంబం

వరుస విజయాల తర్వాత వెంకటేష్‌ హీరోగా నటిస్తున్న చిత్రం `ఆదర్శ కుటుంబం`. `హౌజ్‌ నెంబర్‌ 47` అనేది ట్యాగ్‌ లైన్‌. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించింది. నారా రోహిత్‌, నివేదా పేతురాజ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. హారికా అండ్‌ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్‌ రాధాకృష్ణ(చినబాబు) నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 30న విడుదల కానుంది. ఈ క్రమంలో తాజాగా సినిమా సెన్సార్‌ పూర్తి చేసుకుంది. మరి రిపోర్ట్ ఏంటి? నిడివి ఎంత? ఈ సినిమాని ఎవరు చూడాలి అనేది చూస్తే.

23
ఆదర్శ కుటుంబం సెన్సార్‌ రిపోర్ట్

`ఆదర్శ కుటుంబం` మూవీ తాజాగా సెన్సార్‌ పూర్తి చేసుకుంది. `యూ ఏ` సర్టిఫికేట్‌ని పొందింది. 16ఏళ్లు పై ఉన్న పిల్లలు, పెద్దలు చూడొచ్చు. పెద్దల సమక్షంలో పిల్లలు చూడొచ్చు. సినిమా నిడివి రెండు గంటల 29 నిమిషాలు అని సమాచారం. ఫస్టాఫ్‌ బాగుందని తెలుస్తోంది. సెకండాఫ్‌ కొంత స్లోగా ఉంటుందని, కానీ ఫర్వాలేదనే టాక్‌ వినిపించింది. ఓవరాల్‌గా మూవీ బాగుందని చెబుతున్నారు. ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా సినిమా ఉంటుందట. అక్కడక్కడ యాక్షన్‌ ఉంటుందని, కానీ బాగుంటుందని, చెబుతున్నారు. ఫన్‌, ఫ్యామిలీ ఎలిమెంట్లు, యాక్షన్‌ మేళవింపుగా మూవీ సాగుతుందని సమాచారం.

33
ఆదర్శ కుటుంబం బేసిక్‌ స్టోరీ ఇదేనా

సినిమా వెంకటేష్‌ ప్లాష్‌ బ్యాక్‌లో దొంగగా కనిపిస్తాడట. ప్రస్తుతం బ్యాంక్‌ ఎంప్లాయ్‌గా కనిపిస్తాడని సమాచారం. అయితే సాధారణ లైఫ్‌ లీడ్‌ చేసే వెంకటేష్‌ సడెన్‌గా విల్లాకి మారుతాడని, ఇంటి నెంబర్‌ 47 అని, మరి ఆ ఇంట్లోకి వెళ్లిన తర్వాత అనుకోని సంఘటనలు జరుగుతాయి. పోలీసులు వస్తారు. మరి ఏం జరిగింది? ఆపద వచ్చినప్పుడు తన కుటుంబాన్ని కాపాడుకునేందుకు హీరో ఏం చేశాడనేది సినిమా కథ. ప్రారంభంలో కామెడీగా సాగుతుందని, ఫ్యామిలీ ఎలిమెంట్లు, అప్పుల గోల నవ్వులు పూయిస్తుందని, ఆ తర్వాత కథ యాక్షన్‌ వైపు టర్న్ తీసుకుంటుందని సమాచారం.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories