Rakul Preet Singh: ఐటీ దాడుల విషయంలో నోరు విప్పిన రకుల్ ప్రీత్ సింగ్, ఇచ్చిపడేసిందిగా..

Published : Oct 05, 2026, 02:32 PM IST

Rakul Preet Singh: ఆదాయపు పన్ను శాఖ సోదాలకు సంబంధించి తనపై వస్తున్న వార్తలను ఖండించారు హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. వాస్తవాలను తెలుసుకోకుండా కొందరు ఆన్‌లైన్‌ రిపోర్టర్లు, కొన్నిమీడియా సంస్థలు వార్తలను ప్రచారం చేస్తున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

PREV
14
గాలి వార్తలు ప్రచారం చేస్తున్నారా?

సినిమా పరిశ్రమలో ప్రముఖ నటీనటులు, నిర్మాణ సంస్థలపై ఆదాయపన్ను (IT) శాఖ నిర్వహించే తనిఖీలు తరచూ సంచలనం సృష్టిస్తుంటాయి. ఈ క్రమంలోనే గతంలో తన పేరుతో వచ్చిన కొన్ని ఐటీ సోదాల వార్తలపై హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ స్పందించింది. ఆ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు. కొన్ని కథనాల్లో తన ఇంటిపై, ఆస్తులపై ఐటీ శాఖ దాడులు నిర్వహించినట్లు వచ్చిన వార్తలను రకుల్ ప్రీత్ సింగ్ పూర్తిగా ఖండించారు.

తన ప్రమేయం లేకుండా, ఎలాంటి సోదాలు జరగలేదని ఆమె స్పష్టం చేశారు. చిత్రపరిశ్రమకు చెందిన వ్యక్తులపై తనిఖీలు జరిగినప్పుడు, సంబంధం లేకపోయినా కొందరి పేర్లను ప్రచారంలోకి తీసుకురావడం కొంత మందికి అలవాటుగా మారిందని, ఇది కేవలం అపోహలు , గాలివార్తలు మాత్రమే అని ఆమె అన్నారు.

24
క్లారిటీ ఇచ్చిన రకుల్ ప్రీత్..

రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. ''నేను మొదటినుంచీ చట్టాన్ని గౌరవించే పౌరురాలిగా నిబంధనలకు లోబడి వ్యవహరిస్తున్నాను. నా ఆదాయ వివరాలు, వ్యాపార లావాదేవీలు, పన్ను చెల్లింపుల విషయంలో పూర్తి క్లారిటీతో ఉన్నాను.. ఏటా క్రమం తప్పకుండా ఆదాయపన్ను రిటర్న్లు సమర్పిస్తున్నాను, అధికారుల నిబంధనలను ఎప్పుడూ అతిక్రమించలేదు'' అని అన్నారు.

34
సోషల్ మీడియా ఊహాగానాలపై కామెంట్స్..

ప్రస్తుత డిజిటల్ యుగంలో వాస్తవాలు నిర్ధారించుకోకుండా రూమర్స్ ను చాలా స్పీడ్ గా స్ప్రెడ్ చేస్తున్నారని రకుల్ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా సెలబ్రిటీల విషయంలో చిన్న రూమర్ కూడా పెద్ద వివాదంగా మారే ప్రమాదం ఉందని తెలిపారు. ఏదైనా న్యూస్ ను షేర్ చేసేముందు.. ప్రచారం చేసే ముందు ప్రాథమిక ఆధారాలు చూసుకోవాలని కోరారు. అధికారిక ప్రకటనలు లేకుండా వచ్చే నిరాధారమైన వార్తలను నమ్మవద్దని తన అభిమానులకు, ప్రేక్షకులకు సూచించారు.

44
సినిమాలతో పాటు వ్యాపారాల్లో రకుల్ పెట్టుబడులు..

సినిమాల్లో నటిస్తూనే రకుల్ ప్రీత్ సింగ్ ఫిట్‌నెస్ సెంటర్లు (జిమ్‌లు), ఇతర వ్యాపార రంగాల్లోనూ పెట్టుబడులు పెట్టారు. ఈ కారణంతోనే కొన్నిసార్లు ఐటీ రైట్స్ వార్తల్లో ఆమె పేరు ప్రస్తావనకు వచ్చి ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, తన వ్యాపార వ్యవహారాలన్నీ చట్టబద్ధంగా, ఆడిటింగ్ ప్రక్రియకు లోబడి నడుస్తున్నాయని రకుల్ క్లారిటీ ఇచ్చారు.

సెలబ్రిటీల వ్యక్తిగత, ఆర్థిక జీవితాలపై మీడియాలో నిరంతరం నిఘా ఉండటం సహజమే అయినప్పటికీ, ఆధారాలు లేకుండా వార్తలు వైరల్ చేయడం వారి ఇమేజ్ ను దెబ్బతీస్తాయి. ఐటీ దాడుల ప్రచారానికి చెక్ పెడుతూ రకుల్ ఇచ్చిన క్లారిటీతో ఆమెపై వస్తున్న ఊహాగానాలకు తెరపడింది.

Read more Photos on
click me!

Recommended Stories