Intinti Gruhalakshmi: సామ్రాట్ కు గడువు ఇచ్చిన అనసూయ.. ఆనందంలో లాస్య, నందు!

First Published Oct 5, 2022, 10:33 AM IST

Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి  (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు అక్టోబర్ 5వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం..
 

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే..అనసూయ సామ్రాట్ తో,నేను మీ మాటలు నమ్మలేకపోతున్నాను.మిమ్మల్ని ఇలా వదిలేస్తే జీవితాంతం సమయం తీసుకుంటారు కనుక ఈరోజు పార్టీ అయ్యేలోగా మీరు ఏదో ఒకటి చేయాలి లేకపోతే నేనే రంగం లోకి దిగుతాను. తులసి దృష్టిలో నేను చెడ్డదాన్ని అయిపోయిన పర్వాలేదు కానీ తన జీవితం బాగుండాలి. నలుగురు తులసిని అన్ని మాటలు అంటూ ఉంటే నేను తట్టుకొని ఉండలేను ఇంక మీ ఇష్టం అని చెప్పి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత సీన్లో నందు,లాస్య మాట్లాడుకుంటూ ఉండగా వెనకాతల నుంచి ఎవరో వచ్చి,నందగోపాల్ గారు బాగున్నారా? మీకు ఎన్ని కష్టాలు వచ్చాయి అని అడుగుతాడు. నాకేం కష్టాలు వచ్చాయి నేను బానే ఉన్నాను అని నందు అనగా, అంతేలెండి మీరేం చెప్తారు.మాజీ భార్య దగ్గర పని చేస్తున్నారు కదా మీ కన్నా దౌర్భాగ్యమైన స్థితి ఇంకా ఎవరికీ ఉండకూడదు. అయిన మీ జాతకం ఏంటండి ఇలా తయారయింది ఒకప్పుడు సొంత కంపెనీ ఉండి బాగా ఉండేవారు ఇప్పుడు ఇంకొకరి దగ్గర పనిచేయాల్సి వస్తుంది. 

మీ మాజీ భార్య ఇప్పుడు హాయిగా పని చేసుకుంటున్నారు. ఈవిడ మీ రెండో భార్యా? అని లాస్య వైపు చూపిస్తూ అడుగుతాడ. అవును అని లాస్య అనగా, మీ మొదటి భార్య కన్నా రెండో భార్య బావుంది. ఇప్పుడు మూడో భార్యని తెచ్చుకోండి రెండో భార్య కన్నా బాగుంటుంది అని అంటాడు.అప్పుడు నందు కి కోపం వస్తుంది.లాస్య నందు నీ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.ఇలాంటి సమయంలో గొడవ పడొద్దు నందు అని అనగా అభి అక్కడికి వచ్చి, అవును డాడీ ఇలాంటి సమయంలో మీరు మాట్లాడొద్దు నానమ్మ కూడా మనవైపే ఉన్నారు.మనకు తెలియకుండా మనకు మంచి చేస్తున్నారు అని అనగా, మీ నానమ్మ, తాతయ్య తులసికి వ్యతిరేకంగా ఉంటారు అంటే నేను నమ్మను రా అని నందు అంటాడు. ఆ తర్వాత హనీ నీ తులసి, సామ్రాట్ ఇచ్చిన గౌన్ తో రెడీ చేస్తుంది.నాన్న ఈ రోజు నా పుట్టిన రోజు అయినా నీ ముఖంలో ఆనందం లేకపోతే నాకు బాధ కదా! 

అందుకే నువ్వు చెప్పిన గౌనే వేసుకొని వచ్చాను అని వెళ్లి హద్దుకుంటుంది హానీ. అప్పుడు హనీ స్నేహితులు వచ్చి హనీ ని తీసుకొని వెళ్ళిపోతారు. అప్పుడు తులసి, మీ మనసు ఎందుకు అలా ఉంది సామ్రాట్ గారు. కావాలనే ఈ డ్రెస్ మీరు హనీ చేత వేయించారా, లేకపోతే నేను తెచ్చిన డ్రెస్ నచ్చలేదా, లేకపోతే తెచ్చిన నేనే నచ్చలేదా అసలు ఏమైంది అని అనగా,మీతో విషయం ఎలా చెప్తాను తులసి గారు అని మనసులో తపన పడుతూ ఉంటాడు సామ్రాట్. అంతలో బయటికి మాత్రం, నాకు హనీ నాకన్నా మీకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంటే నచ్చట్లేదు తులసి గారు. సమయం ఎప్పుడు ఒకలాగే ఉండదు కదా అని అనగా, అయితే మీకు నా మీద నమ్మకం లేదా అని తులసి అంటుంది.అలాగని కాదు కానీ హనీ దృష్టిలో నేనే మొదటి స్థానంలో ఉండాలని కోరుకుంటున్నా అని అనగా,తులసి గట్టిగా నవ్వి,ఇదా మీ సమస్య! నేను మీరు ఆఫీస్ లో జరిగిన దాని గురించి కోపంగా ఉన్నారు అనుకున్నాను.

మీరు అలాగ భయపడాల్సిన అవసరం లేదు హనీకి ఎప్పుడు మీరే మొదటి స్థానంలో ఉంటారు అని చెప్తుంది. ఆ తర్వాత అందరూ పార్టీకి రెడీ అయ్యి బయట కేక్ కటింగ్ కి వస్తారు. అప్పుడు హనీ, తులసి,సామ్రాట్ ముగ్గురు కలిసి వస్తున్నప్పుడు లాస్య దాన్ని చూసి, మొగుడు పెళ్ళాలు కూతురుతో వస్తున్నట్లు చూడు కుటుంబ సమేతంగా ఎలా వస్తున్నారో అని నందుని ఎటకారిస్తూ ఉంటుంది.మరోవైపు అనసూయ కూడా వాళ్ళని చూసి తట్టుకోలేకపోతుంది. అప్పుడు సామ్రాట్ కేక్ కట్ చేద్దామా అని అనగా, ఆగండి నాన్న నేను తులసి ఆంటీ కోసం ఒక పాట నేర్చుకున్నాను. నా పుట్టిన రోజుకి తనకి బహుమతిగా ఇవ్వడానికి అని చెప్పి అమ్మ మీద పాట పాడుతూ ఉంటుంది హని. అప్పుడు తులసికి పాట బాగా నచ్చి నువ్వు ఇంత బాగా పడతావ్ అని అనుకోలేదు అని చెప్పి కేక్ కట్ చేపిస్తుంది. అప్పుడు హనీ, తులసికే మొదటి కేక్ ముక్క పెడుతుంది. దానికి ఇంట్లో కుటుంబ సభ్యులు అందరూ ఆనందపడగా,అనసూయ, అభీలు మాత్రం చిరాకు పడతారు.

నేను ఇంత చెప్పినా సరే సామ్రాట్ మనసు మారలేదు ఎందుకు? అని అనసూయ అనుకుంటూ ఉంటుంది. అప్పుడు సామ్రాట్ మైక్ తీసుకుని, నేను ఈరోజు మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను అని నందుని స్టేజ్ మీదకు పిలుస్తాడు సామ్రాట్. అప్పుడు లాస్య, ఇప్పుడు నందుని ఏమైనా తిడతాడా అని అనుకుంటుంది. అప్పుడు సామ్రాట్,ఈరోజు ఉదయం ఒక విషయం జరిగింది.పొరపాటున చేసిన తప్పు వాళ్ళ మా కంపనీ కి 10 కోట్లు నష్టం వచ్చేది కానీ నందు చూసి దాన్ని అడ్డుకున్నాడు.నందుని నేను చాలా రోజుల నుంచి చూస్తున్నాను తన పనితీరును గమనిస్తున్నాను.
 

తన పనితీరుకి నచ్చి నేను, తులసి గారు ఉన్న మేనేజర్ పోస్ట్ ని ఇప్పుడు నందు కి ఇస్తున్నాను అని అనగా తులసి కుటుంబ సభ్యులందరూ ఆశ్చర్యపోతారు. లాస్య మాత్రం ఆనందంగా వెళ్లి నందుని హద్దుకుంటుంది. అప్పుడు ప్రేమ్,శృతి,పరంధామయ్యలు మాట్లాడుకుంటూ మేనేజర్ పోస్ట్ ఇచి 2 రోజులు కూడా అవలేదు కదా ఎందుకు అప్పుడే తీసేస్తున్నారు వెళ్లి అడుగుదామని అనుకోగా ప్రేమ్ ఆపి,వద్దు అమ్మకు చెప్పకుండా అడిగితే బాగోదు అని అంటాడు.
 

ఇంతలో తులసి శుభాకాంక్షలు చెప్పి సామ్రాట్ తో, ఎవరైతే ఏ మొహమాటాలు లేకుండా తన కంపెనీ మంచి కోసం చూస్తారో తనే నిజమైన బాస్.సామ్రాట్ గారు మీరే అసలైన బాస్ మంచి పని చేశారు అని అంటుంది.ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.తరువాయి భాగం లో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

click me!