సినిమా టీజర్లో పాత్రల గురించి వస్తున్న చర్చలపై కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. టీజర్లో 'సత్యవన్న' అని పిలవడం, అలాగే మెగాస్టార్ లీక్ చేసిన 'కదిరి కాళిదాస్' పేర్ల వెనుక పెద్ద కథే ఉన్నట్లు తెలుస్తోంది. ఇవి రెండూ వేర్వేరు పాత్రలా లేక ఒకే వ్యక్తి మారిన రూపామా అన్నది సినిమాలోని ట్విస్ట్ గా ఉండనుంది. ఈ కథలో అనేక లేయర్స్ ఉన్నాయని, జనవరి 13 వరకు ఈ సస్పెన్స్ కొనసాగుతుందని కోన వెంకట్ అన్నారు.
అభిమానులకు పెద్ద షాకే..
మెగాస్టార్ చిరంజీవి అంటే అభిమానులు కోరుకునేది యాక్షన్ తో పాటు డ్యాన్స్ , డ్యూయోట్స్, హీరోయిన్ తో మంచి లవ్ ట్రాక్. కానీ ఈ సినిమాలో అవేమీ ఉండవని తెలుస్తోంది. హీరోయిన్ లేకుండా, డ్యూయెట్లు, లవ్ ట్రాక్లు లేకుండా చిరంజీవి ఒక్కడిమీదే సినిమా కథ సాగుతుందట. మెగాస్టార్ వన్ మ్యాన్ షో చేయబోతున్నట్టు సమాచారం. ముఖ్యంగా ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్, పవర్ఫుల్ ఎమోషన్స్ ఈ సినిమాకు ప్రధాన బలమని తెలుస్తోంది. యాక్షన్, ఎమోషన్ కలబోతగా వస్తున్న ఈ మాస్ ఎంటర్టైనర్ కోసం మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.