పోస్ట్ లో నాలుగు పేజీల లేఖ పంపిన అభిమాని.. అందులో రాసిన విషయాలు చదివి శ్రీముఖి మైండ్ బ్లాక్

 
స్టార్ యాంకర్ శ్రీముఖికి(Sreemukhi) ఓ అభిమాని మైండ్ బ్లాక్ చేశాడు. ఆమె గురించి విషయాలు బయటపెడుతూ ఏకంగా నాలుగు పేజీల లేఖ పోస్ట్ లో పంపారు. 

అభిమానానికి హద్దులు ఉండవు అంటారు. సెలెబ్రిటీలను ఆరాధించే ఫ్యాన్స్ చేసే చర్యలు ఒక్కోసారి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతూ ఉంటాయి. అలాంటి సంఘటనే శ్రీముఖి అభిమాని చేశారు. శ్రీముఖికి ఏకంగా నాలుగు పేజీల లెటర్ పోస్ట్ లో పంపారు. 
 

ఇక సదరు అభిమాని లెటర్ అచ్చతెలుగు పదాలు ఉపయోగిస్తూ శ్రీముఖి అందాన్ని, ఆమె యాంకరింగ్ టాలెంట్ ని ఆకాశానికి ఎత్తారు. ఈవెంట్ ఏదైనా మీరు ఉంటే అభిమానులు వెఱ్ఱిత్తిపోతారు అన్నారు. 
 


అందంలో, అభినయంలో మీకు సాటిలేరని వివరించారు. సుదీర్ఘమైన లేఖలో శ్రీముఖి కెరీర్ లోని ముఖ్యమైన మలుపులను, ఘట్టాలను ప్రస్తావించాడు. గ్లామర్ ఫీల్డ్ లో శ్రీముఖి మరిన్ని శిఖరాలు అధిరోహించాలి, ఉన్నత స్థాయికి చేరుకోవాలని లేఖ ముగించాడు. 

సదరు అభిమాని పేరు వెంకట్ అని తెలుస్తుండగా, అంతకు మించిన వివరాలు ఏవీ లేవు. ఇక ఈ లెటర్ ని శ్రీముఖి తన ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో పంచుకున్నారు. సోషల్ మీడియా యుగంలో అచ్చతెలుగులో నాలుగు పేజీల లేఖ రాశారు. 

నా కెరీర్ లో ముఖ్యమైన సంఘటనలు ప్రస్తావిస్తూ సాగిన ఈ లేఖ చదువుతుంటే ఎంతో ఆనందం వేసింది. మీరు ఎవరో కానీ ధన్యవాదాలు అంటూ శ్రీముఖి కృతజ్ఞత చాటుకున్నారు. 

ప్రస్తుతం ఈ లెటర్ వైరల్ గా మారింది. యాంకర్ శ్రీముఖికి కూడా డై హార్డ్ ఫ్యాన్స్ ఉన్నారని, ఆమెను అనుక్షణం ఫాలో అవుతున్నారని తాజా సంఘటన ద్వారా అర్థం అయ్యింది. మరోవైపు నటిగా , యాంకర్ గా శ్రీముఖి దూసుకుపోతున్నారు.

సోలో హీరోయిన్ గా క్రేజీ అంకుల్స్ మూవీ చేసిన ఇటీవల ఓటిటి లో విడుదలైన మ్యాస్ట్రో చిత్రంలో విలన్ వైఫ్ పాత్ర చేశారు. కెరీర్ తో పాటు బిసినెస్ లు చూసుకుంటూ శ్రీముఖి ముందుకు వెళుతున్నారు. 

Latest Videos

click me!