కొన్నేళ్లుగా మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్ దూరంగా ఉంటున్నాడు అనేది నిజం. ఇది మెగా అభిమాన సంఘాలు కూడా గుర్తించాయి. విజయవాడ వేదికగా జరిగిన అభిమాన సంఘం సమావేశంలో ఓ వ్యక్తి అల్లు అర్జున్ పై అనుచిత కామెంట్స్ చేశాడు.
అల్లు అర్జున్ మెగా హీరో కాదు. చిరంజీవి అండతో ఎదిగిన అల్లు అర్జున్ జనసేన పార్టీకి చేసిందేమీ లేదంటూ ఫైర్ అయ్యాడు. అభిమాన సంఘం అధ్యక్షుడు చేసిన కామెంట్స్ దుమారం రేపాయి. వ్యతిరేకత వ్యక్తం కావడంతో సదరు వ్యక్తి అల్లు అర్జున్ కి క్షమాపణలు చెప్పాడు.
ఇక రామ్ చరణ్-అల్లు అర్జున్ అయితే ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు. వారిద్దరు ఆత్మీయంగా పలకరించుకున్న సందర్భం ఇటీవల కాలంలో చూడలేదు. 2024 సంక్రాంతి వేడుకలు కలిసి జరుపుకుని మెగా-అల్లు ఫ్యామిలీలు విబేధాల రూమర్స్ కి చెక్ పెట్టే ప్రయత్నం చేశారు.
కాగా సార్వత్రిక ఎన్నికలు ఈ కోల్డ్ వార్ ని తారా స్థాయికి తీసుకెళ్లాయి. నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవికి అల్లు అర్జున్ పూర్తి మద్దతు తెలపడం మెగా ఫ్యామిలీకి, జనసేన శ్రేణులకు నచ్చలేదు. ఈ పరిణామం తర్వాత అల్లు అర్జున్ పై ఓపెన్ గానే మాటల దాడి చోటు చేసుకుంది. జనసేన నేతలు అల్లు అర్జున్ పై కీలక ఆరోపణలు చేశారు.
నాగబాబు, సాయి ధరమ్ పరోక్షంగా అల్లు అర్జున్ పై తమ అసహనం వెళ్లగక్కారు. కర్ణాటక పర్యటనలో పవన్ కళ్యాణ్ సైతం ఇండైరెక్ట్ గా అల్లు అర్జున్ మీద విమర్శలు గుప్పించాడు. ఒకప్పుడు హీరోలు అడవులను పెంచి, అభివృద్ధి చేసే పాత్రలు చేసేవాళ్ళు. ఈ తరం హీరోలు అడవులను నరికి స్మగ్లింగ్ చేసే పాత్రలు చేస్తున్నారు. నటుడిగా అలాంటి పాత్రలు చేయడం నాకు ఇష్టం ఉండదు అన్నారు.
పుష్ప చిత్రంలోని అల్లు అర్జున్ పాత్రను ఉద్దేశించే పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశాడనే వాదనలు వినిపించాయి. సుకుమార్ భార్య ప్రొడ్యూస్ చేసిన మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అతిథిగా హాజరైన అల్లు అర్జున్, ఇష్టమైన వ్యక్తుల కోసం ఎక్కడికైనా వెళతా అంటూ.. మెగా హీరోలకు తన సందేహం పంపాడు. ఎవరికీ భయపడేది లేదు, తగ్గేదేలే అని చెప్పి, అగ్నికి ఆజ్యం పోశాడు.
మెగా ఫ్యామిలీతో కాంప్రమైజ్ అయ్యే ఆలోచన అల్లు అర్జున్ కి లేదని ఆ సంఘటన స్పష్టం చేసింది. ఇక మెగా ఫ్యాన్స్ రెండు వర్గాలుగా విడిపోయి కొట్టుకుంటున్నారు. రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో అల్లు అర్జున్ ఫ్యాన్స్ వార్ ఆఫ్ వర్డ్స్ కొనసాగుతుంది. ఒకరినొకరు ట్రోల్ చేసుకుంటున్నారు.
ఈ పరిస్థితుల నడుమ పవన్ కళ్యాణ్ నోటి వెంట అల్లు అర్జున్ పేరు రావడం చర్చకు దారి తీసింది. ఓ పొలిటికల్ ఈవెంట్లో పాల్గొన్న పవన్ కళ్యాణ్.. ముందు రాష్ట్రాభివృద్ధి అవసరం. రోడ్లు బాగు చేసుకోవాలి. ఉద్యోగ కల్పన జరగాలి. అప్పుడే మనం మన అభిమాన హీరో సినిమా చూడగలం, అన్నారు.
చిరంజీవి, బాలకృష్ణ, తారక్, మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్... హీరోలందరూ నాకు ఇష్టం. నేను అందరూ బాగుండాలని కోరుకుంటాను. ముందు వినోదం కాదు, మనకు అభివృద్ధి అవసరం, అన్నారు. పవన్ కళ్యాణ్ నోట స్టార్ హీరోల పేర్లు పలుకుతుంటే.. మీటింగ్ లో పాల్గొన్న యువతలో సందడి నెలకొంది.
Allu Arjun
నేను ఏ హీరోతో పోటీపడను. నాకు అందరు ఇష్టమే అనడం ద్వారా.. అల్లు అర్జున్ తో తనకు విబేధాలు లేవనే సంకేతం ఆయన పంపినట్లు అయ్యింది. కాగా త్వరలో ప్రసారం కానున్న అన్ స్టాపబుల్ సీజన్ 4లో అల్లు అర్జున్ పాల్గొన్నారట. మెగా హీరోలతో నెలకొన్న విభేదాలపై అల్లు అర్జున్ ని బాలకృష్ణ ప్రశ్నించారట. స్పష్టత ఇచ్చిన అల్లు అర్జున్, ఈ గొడవలకు చెక్ పెట్టేలా మాట్లాడారనే పుకార్లు వినిపిస్తున్నాయి..