నాగ చైతన్య రెండో పెళ్ళికి సిద్ధమైన వారం రోజుల వ్యవధిలో సమంత పై ఎఫైర్ రూమర్స్ రావడం విశేషం. దర్శకుడు రాజ్ నిడిమోరు-సమంత డేటింగ్ చేస్తున్నారు అనేది లేటెస్ట్ న్యూస్. బాలీవుడ్ మీడియాలో ఈ మేరకు కథనాలు వెలువడుతున్నాయి. ది ఫ్యామిలీ మ్యాన్, ది ఫ్యామిలీ మ్యాన్ 2, ఫర్జీ వంటి సక్సెస్ఫుల్ సిరీస్లు తెరకెక్కించిన రాజ్ అండ్ డీకే ఇండియా వైడ్ పాపులారిటీ తెచ్చుకున్నారు.