టాలీవుడ్ లో ఎప్పటికప్పుడు కొత్త తరం నటీనటులు, దర్శకులు, సంగీత దర్శకులు వస్తూనే ఉంటారు. ఎంత మంది వచ్చినా కొందరు లెజెండ్స్ చిత్ర పరిశ్రమపై చూపే ప్రభావం అలాగే ఉండిపోతుంది. సంగీత దర్శకుల విషయానికి వస్తే టాలీవుడ్ లో మణిశర్మ తప్పకుండా లెజెండ్ అనే చెప్పొచ్చు. స్వరబ్రహ్మ అని అభిమానులు ముద్దుగా పిలుచుకుంటారు.
ఇప్పుడు మణిశర్మ ప్రభావం కాస్త తగ్గింది. కానీ ఒకప్పుడు మణిశర్మ సంగీతం లేకుండా స్టార్ హీరోల చిత్రాలు ఉండేవి కాదు. చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, మహేష్ బాబు లాంటి హీరోలకు మణిశర్మ సంగీతం తప్పనిసరి.
మణిశర్మకి టాలీవుడ్ లో అంత డిమాండ్ ఉండేది. దీనితో నిర్మాతలు ఎంత రెమ్యునరేషన్ ఇచ్చేందుకు అయినా వెనుకాడలేదు. మణిశర్మ ఓ ఇంటర్వ్యూలో తన రెమ్యునరేషన్ గురించి యాంకర్ ప్రశ్నించగా స్పందించారు. తన కెరీర్ లో అందుకున్న బెస్ట్ రెమ్యునరేషన్ గురించి మణిశర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
నా కెరీర్ లో నేను అందుకున్న బెస్ట్ రెమ్యునరేషన్ కోటి రూపాయలు.. అది మెగాస్టార్ చిరంజీవి ఇంద్ర చిత్రానికి అని మణిశర్మ తెలిపారు. నిర్మాత సింగల్ పేమెంట్ లో మొత్తం ఇచ్చేశారు. టాలీవుడ్ లో కోటి రూపాయలు అందుకున్న మొట్ట మొదటి మ్యూజిక్ డైరెక్టర్ నేనే అనే మణిశర్మ తెలిపారు.
అప్పట్లో అది టాలీవుడ్ లో సంచలనం. ఆ తర్వాత చాలా చిత్రాలకు ఇంకా ఎక్కువ రెమ్యునరేషన్ అందుకుని ఉండొచ్చు కానీ ఇంద్ర చిత్రానికి కోటి రూపాయలు తీసుకోవడం కూడా మరచిపోలేని ఎక్స్పీరియన్స్ అని మణిశర్మ అన్నారు.
ప్రస్తుతం ఫామ్ లో ఉన్న దేవిశ్రీ ప్రసాద్ 5 నుంచి 8 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటారు. తమన్ 4 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుంటారు. కనై టాలీవుడ్ లో ఫస్ట్ టైం కోటి రూపాయల మార్క్ టచ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ మాత్రం మణిశర్మ.