ప్రభాస్‌ కొత్త సినిమా నుంచి అదిరిపోయే అప్‌డేట్‌.. పూజా కార్యక్రమాలు.. ఏ మూవీనో తెలుసా?

First Published | Aug 17, 2024, 12:29 PM IST

ఇటీవల `కల్కి 2898 ఏడీ`తో అలరించిన ప్రభాస్‌ ఇప్పుడు మరో సినిమాని స్టార్ట్ చేస్తున్నాడు. కొత్త సినిమాకి సంబంధించిన ఓ అప్‌ డేట్‌ నెట్టింట చక్కర్లు కొడుతుంది.  
 

డార్లింగ్‌ ప్రభాస్‌ `కల్కి 2898 ఏడీ` చిత్రంతో అలరించారు. ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్‌ మూవీగా నిలిచింది. సుమారు వెయ్యి కోట్ల కలెక్షన్లు వసూలు చేసింది. నాగ్‌ అశ్విన్‌ చేసిన మ్యాజిక్‌కి, ప్రభాస్‌ ఇమేజ్‌, అమితాబ్‌ బచ్చన్‌, దీపికాల నటన, కమల్‌ హాసన్‌, విజయ్‌ దేవరకొండ, దుల్కర్‌ సల్మాన్‌ ల స్పెషల్‌ ఎట్రాక్షన్‌ సినిమాకి పెద్ద అసెట్‌గా నిలిచింది. 

ప్రస్తుతం ప్రభాస్‌ `ది రాజాసాబ్‌` సినిమాలో నటిస్తున్నాడు. ఇటీవల దీనికి సంబంధించిన చిన్న గ్లింప్స్ కూడా వచ్చింది. రొమాంటిక్‌ బాయ్ లుక్‌లో డార్లింగ్‌ ఆకట్టుకున్నాడు. ఇది చిత్రీకరణ దశలో ఉంది. రొమాంటిక్‌ హర్రర్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు మారుతి. వింటేజ్‌ ప్రభాస్‌ని చూపించబోతున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్‌లో రాబోతుంది. 
 


ఇదిలా ఉంటే ప్రభాస్‌ చేయాల్సిన సినిమాల జాబితా చాలానే ఉంది. సందీప్‌ రెడ్డి వంగా `స్పిరిట్‌` చేయాలి. అలాగే హనుష్‌ రాఘవపూడితో సినిమా, `సలార్‌ 2`, `కల్కి 2` చిత్రాలున్నాయి. వీటిలో ఏది ముందు ప్రారంభం అవుతుందనేది పెద్ద సస్పెన్స్. అయితే లేటెస్ట్ గా ప్రభాస్‌ కొత్త సినిమాకి సంబంధించిన అప్‌డేట్‌ బయటకు వచ్చింది. నేడు కొత్త సినిమాని ప్రారంభిస్తున్నారట. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట చక్కర్లు కొడుతుంది. 
 

హను రాఘవపూడి దర్శకత్వంలో చేయాల్సిన సినిమాని ప్రారంభించబోతున్నారట. అందులో భాగంగా నేడు శనివారం హైదరాబాద్‌లో ఆఫీస్‌ తీసుకున్నారట. దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఈ రోజు చేశారట. ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ చేస్తున్నారట. ప్రభాస్‌ నెక్ట్స్ చేయబోతున్న సినిమా ఇదే అని సమాచారం. తాజాగా ఆఫీస్‌ ఓపెన్‌ చేశారంటే ఆల్మోస్ట్ ఇదే అని కన్ఫమ్‌ అవుతుంది. 
 

ప్రభాస్‌, హను రాఘవపూడి చిత్రానికి `ఫౌజీ` అనే పేరుని పరిశీలిస్తున్నారు. రెండో ప్రపంచ యుద్ధం బ్యాక్‌ డ్రాప్‌లో వార్‌ నేపథ్య పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాగా భారీ స్థాయిలో తెరకెక్కించేందుకు ప్లాన్‌ చేస్తున్నారు హను రాఘవపూడి. వార్‌ బ్యాక్‌ డ్రాప్‌లో లవ్‌ ట్రాక్‌ హైలైట్ గా ఉంటుందని తెలుస్తుంది. మరి సినిమా ఆఫీస్‌ ఓపెన్‌ చేసిన టీమ్‌.. సినిమా షూటింగ్‌ ఎప్పుడు ప్రారంభిస్తుందో చూడాలి.

Latest Videos

click me!