Allu Arjun Home Tour: 100 కోట్ల అల్లు అర్జున్ 'బ్లెస్సింగ్' ఇల్లు చూశారా? లోపల ఎంత లగ్జరీగా ఉందో చూడండి

Published : Sep 09, 2026, 02:35 PM IST

Allu Arjun Home Tour: హైదరాబాద్‌లోని అల్లు అర్జున్ ఇల్లు 'బ్లెస్సింగ్' గురించి ప్రత్యేకంగా చెప్పాలి. మినిమలిస్ట్ డిజైన్, లగ్జరీ, కుటుంబానికి కావాల్సిన సౌకర్యాలు.. అన్నీ ఇందులో ఉన్నాయి. దాదాపు 100 కోట్ల విలువ చేసే ఈ ఇల్లు ప్రత్యేకలు ఏంటో తెలుసా?

PREV
15
జూబ్లీహిల్స్‌లో విశాలమైన ఇల్లు

తెరపై అల్లు అర్జున్ఎంత స్టైలిష్‌గా కనిపిస్తారో, ఆయన ఇల్లు మాత్రం అందుకు భిన్నంగా చాలా ప్రశాంతంగా ఉంటుంది. హైదరాబాద్‌లోని ఖరీదైన జూబ్లీహిల్స్ ఏరియాలో ఉన్న ఈ ఇంటికి 'బ్లెస్సింగ్' అని పేరు పెట్టారు. ఈ ఇంటి విలువ సుమారు రూ.100 కోట్లు ఉంటుందని రిపోర్టులు చెబుతున్నాయి.

ఈ ఇల్లు రెండు ఎకరాల స్థలంలో 8,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఇందులో అల్లు అర్జున్, ఆయన భార్య స్నేహారెడ్డి, పిల్లలు అయాన్, అర్హ, వారి పెంపుడు కుక్క కజోకు కలిసి ఉంటారు.

బాక్స్ ఆకారంలో ఆకట్టుకునే డిజైన్

ఈ ఇంటి ఆర్కిటెక్చర్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. 'ఆమిర్ & హమీదా అసోసియేట్స్'కు చెందిన ప్రముఖ ఆర్కిటెక్ట్ ఆమిర్ శర్మ దీనిని డిజైన్ చేశారు. ఫ్లాట్ రూఫ్‌తో, దీర్ఘచతురస్రాకారంలో, తెలుపు రంగులో చూడటానికి చాలా సింపుల్‌గా, క్లాస్‌గా కనిపిస్తుంది.

బయటి నుంచి చూస్తే ఇల్లు చాలా సింపుల్‌గా, అతి తక్కువ కిటికీలతో కనిపిస్తుంది. ఈ మినిమలిస్ట్ డిజైన్ ఇంటికి ఒక శిల్పం లాంటి అందాన్ని ఇస్తుంది.

25
సింపుల్ అండ్ క్లాసీ ఇంటీరియర్స్

ఇంటి లోపల కూడా ఆడంబరాలకు పోకుండా చాలా సింపుల్‌గా డిజైన్ చేశారు. 'ఆర్కిటెక్చరల్ డైజెస్ట్' మ్యాగజైన్ ఈ ఇంటి గురించి వివరిస్తూ.. న్యూట్రల్ రంగులు, మెరిసే మార్బుల్ ఫ్లోరింగ్, ఆధునిక ఫర్నిచర్‌తో ఇల్లు చాలా అందంగా ఉందని చెప్పింది.

లివింగ్ ఏరియాలో లేత బూడిద, క్రీమ్ రంగులు వాడారు. చెక్క ఫర్నిచర్, ఆర్ట్ వర్క్, మొక్కలు ఇంటికి మరింత అందాన్ని తెచ్చాయి. డైనింగ్ ఏరియా నుంచి బయట గార్డెన్ వ్యూ కనిపించేలా ఏర్పాటు చేశారు.

ప్రైవేట్ పూల్, పచ్చని గార్డెన్

ఈ ఇంటికి అసలైన హైలైట్ అవుట్‌డోర్ ఏరియా. అందమైన గార్డెన్, స్విమ్మింగ్ పూల్ ఇంటికి రిసార్ట్ లుక్‌ను ఇస్తాయి.

ఈ పూల్ పక్కనే ఉన్న ఎంటర్‌టైన్‌మెంట్ ఏరియాలో కుటుంబంతో సరదాగా గడపడానికి, పార్టీలు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. పచ్చదనం, ఓపెన్ స్పేస్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో ఈ ఇల్లు ఓ హాలిడే హోమ్‌లా అనిపిస్తుంది.

35
కుటుంబం కోసం కట్టిన ఇల్లు

ఈ ఇంటి విలువ రూ.100 కోట్లు అయినా, కేవలం గొప్పకోసం కట్టింది కాదు. అయాన్, అర్హ కోసం ప్రత్యేక గదులు, హాయిగా కూర్చుని సినిమాలు చూసేందుకు టీవీ రూమ్, విశాలమైన కిచెన్.. ఇలా ప్రతిదీ కుటుంబ అవసరాలకు తగ్గట్టుగా డిజైన్ చేశారు.

పిల్లల గదులు రంగురంగుల్లో ఉంటే, మిగతా ఇల్లంతా న్యూట్రల్ రంగులతో ప్రశాంతంగా ఉంటుంది. ఇంటి చుట్టూ ఉన్న పచ్చని వాతావరణం కుటుంబంతో సమయం గడపడానికి చాలా బాగుంటుంది.

45
'బ్లెస్సింగ్' ఎందుకంత ప్రత్యేకం?

అల్లు అర్జున్ ఇంటిని ఇంత ప్రత్యేకంగా మార్చింది ఏంటంటే.. దాని ఖరీదుకు, డిజైన్‌కు మధ్య ఉన్న తేడా. వంద కోట్ల ఇల్లు అంటే ఎంతో ఆడంబరంగా ఉంటుందని అనుకుంటారు. కానీ, ఈ ఇల్లు చాలా సింపుల్ ఆర్కిటెక్చర్, సహజమైన వెలుతురు, పచ్చదనం, ఓపెన్ స్పేస్‌తో లగ్జరీ ఫీల్‌ను ఇస్తూనే ప్రశాంతమైన వాతావరణాన్ని అందిస్తుంది.

55
'బ్లెస్సింగ్' గురించి

రెండు ఎకరాల స్థలం, ప్రత్యేకమైన తెలుపు రంగు ఆర్కిటెక్చర్, కుటుంబానికి ప్రాధాన్యతనిచ్చే ఇంటీరియర్స్‌తో 'బ్లెస్సింగ్' ఇల్లు హైదరాబాద్‌లోని సెలబ్రిటీ హోమ్స్‌లో ఎప్పుడూ హాట్ టాపిక్‌గా ఉంటుంది.

Read more Photos on
click me!

Recommended Stories