న్యూటన్ యాపిల్ తో గ్రావిటీ కనిపెడితే.. అదెక్కడెయ్యాలో కనిపెట్టా..సుమ నీకైతే గుమ్మడికాయే..రాఘవేంద్రరావు పంచులు

First Published | Sep 28, 2021, 10:33 PM IST

తనదైన పంచ్‌లతో రెచ్చిపోయే యాంకర్‌ సుమ(anchor suma)కి మైండ్‌ బ్లాంక్‌ అయ్యింది. దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు(k raghavendra rao) సుమపై షాకింగ్‌ కామెంట్‌ చేశారు. తన కోసం గుమ్మడి కాయ రెడీగా పెట్టాడంటూ షాకిచ్చాడు. షోలో ఓ రేంజ్‌లో ఆడుకున్నాడు. 

యాంకర్‌ సుమ హోస్ట్ గా విజయవంతంగా `క్యాష్‌` షో రన్‌ అవుతుంది. లేటెస్ట్ ఎపిసోడ్‌లో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు పాల్గొన్నారు. తాను దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందుతున్న `పెళ్లిసందd` సినిమా యూనిట్‌తో కలిసి ఆయన సందడి చేశారు. ఇందులో సుమని ఓ ఆట ఆడుకున్నాడు. 
 

వందకిపైగా సినిమాలకు దర్శకత్వం వహించిన కె.రాఘవేంద్రరావుకి ఇంట్రడక్షన్‌ అదే రేంజ్‌లో ఇచ్చింది సుమ. అంతేకాదు స్టేజ్‌పైకి వస్తోన్న రాఘవేంద్రరావు తన పాయింట్‌ని సరి చేసుకున్నారు. పైకి వచ్చిన రాఘవేంద్రరావుని ఇమిటేట్‌ చేస్తూ `చిరంజీవి గారు దీన్ని తర్వాత కాపీ కొట్టారని తెలిసింది` అని చెప్పిన సుమకి దిమ్మతిరిగే పంచ్‌ ఇచ్చాడు రాఘవేంద్రరావు. 
 


సుమపై కేసు పెడతానని తెలిపారు. నేను ఇలా అంటానని నువ్వు కూడా చేయి చెప్పడమేంటి, ఎగతాళా? అంటూ కామెంట్‌ చేశారు. అంతటితో ఆగలేదు. `అప్పటి నుంచి ట్రై చేస్తున్న ఎప్పుడూ ఛాన్స్ ఇవ్వలేదు. నీ కోసం గుమ్మడి కాయ రెడీగా పెట్టాను` అంటూ రాఘవేంద్రరావు దాన్ని ఎలా వేయాలో చేయితో చూపించే ప్రయత్నం చేశాడు. దీంతో సుమ ముఖం మైండ్‌ బ్లాంక్‌ అయ్యింది. `సర్‌` అంటూ పరారైంది. 

ఆ తర్వాత పండ్లలో రాజుని ఏ పండుని పిలుస్తారని సుమ అడగ్గా.. శ్రీధర్‌ సీపాన జామ పండు అన్నాడు. తన నాలెడ్జ్ అంతే అని చెప్పారు. ఇక రాఘవేంద్ర రావు చెబుతూ, నాక్కుడా పెద్దగా నాలెడ్జ్ లేదని చెప్పాడు. అంతటితో ఆగలేదు.. ఆపిల్‌ గురించి కొత్త అర్థాన్ని వివరించారు. 
 

తాను ఆపిల్‌నే పండ్లకి రాజుగా భావిస్తాడట. న్యూట్రన్‌ ఆపిల్‌తో గ్రావిటీ కనిపెట్టాడు. తాను న్యూట్రన్‌ కంటే ఏం తక్కువ కాదని చెప్పి.. యాపిల్‌ ఎక్కడ పడాలో కనిపెట్టానంటూ మైండ్‌ బ్లోయింగ్‌ సమాధానం చెప్పాడు. రాఘవేంద్రరావు సమాధానానికి అటు సుమకి, ఇటు రోషన్‌, శ్రీలీలకి, అందులో ఉన్న అందరికి దిమ్మతిరిగిపోయింది. రాఘవేంద్రరావు పంచ్‌కి అందరు ఘోళ్లుమని నవ్వడం హైలైట్‌గా నిలిచింది. 

రాఘవేంద్రరావు తెలుగు చిత్ర పరిశ్రమకి పండ్లని పరిచయం చేసిన విషయం తెలిసిందే. హీరోయిన్ల బొడ్డుపై,నడుములపై పూలు, పండ్లు వేస్తూ పాటల్లో రొమాన్స్ ని పీక్‌లోకి తీసుకెళ్లారు. పండ్ల విషయంలో ఓ ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచారు. కమర్షియాలిటీకి కొత్త అర్థాన్నిచ్చిన విషయం తెలిసిందే. 

చివర్లో క్యాష్‌ షోపై రాఘవేంద్రరావు ఫైర్‌ అయ్యారు. క్యాష్‌ ఇస్తామని చెప్పి, డబ్బు ఇవ్వకుండా తమని ఛీటింగ్‌ చేశారంటూ ఫైర్‌ అయ్యారు. వెనకాల నుంచి ఏమేమో చేస్తున్నారని మండిపడ్డారు. సుమ రిక్వెస్ట్ చేసినా వినకుండా.. చాలా ఇరిటేషన్‌గా ఉందంటూ వెళ్లిపోతామని మధ్యలోనే వెళ్లిపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మరి ఇది షోలో డ్రామానా? లేక నిజంగానే జరిగిందా? అన్నది ఆసక్తికరంగా మారింది.

Latest Videos

click me!