‘వీరసింహారెడ్డి’ నుంచి సాలిడ్ డైలాగ్ లీక్.. ఈ స్థాయిలో ఉంటే థియేటర్లు దద్దరిల్లాల్సిందే.!

Published : Oct 22, 2022, 11:21 AM ISTUpdated : Oct 22, 2022, 11:23 AM IST

నందమూరి నటసింహం, బాలయ్య నటిస్తున్న ‘వీరసింహారెడ్డి’ చిత్రం కోసం అభిమానులు ఎంతగానో ఎదరుచూస్తున్నారు. ఈ క్రమంలో మూవీ నుంచి ఓ మాస్ డైలాగ్ లీక్ అయ్యింది.  ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది.  

PREV
16
‘వీరసింహారెడ్డి’ నుంచి సాలిడ్ డైలాగ్ లీక్.. ఈ స్థాయిలో ఉంటే థియేటర్లు దద్దరిల్లాల్సిందే.!

‘అఖండ’తో బ్లాక్ బస్టర్ అందుకున్నారు నందమూరి నటసింహం బాలకృష్ణ (Balakrishna). ప్రస్తుతం మరో మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘వీరసింహా రెడ్డి’లో నటిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు గోపీచంద్ మాలినేని  డైరెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే  చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఈ మేరకు మేకర్స్  కూడా బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ఇస్తూ వస్తున్నారు. 
 

26

ముఖ్యంగా బాలకృష్ణ చిత్రాలంటే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్ని ఉంటాయి. వాటిని రీచ్ అయ్యేందుకు మేకర్స్ తగనంతగా కష్టపడుతున్నారు. అయితే బాలయ్య సినిమాల నుంచి అభిమానులు ఎక్కువగా కోరుకునేది మాస్ డైలాగ్స్, గూస్ బంప్స్ తెప్పించే సీన్స్, సాలిడ్ యాక్షన్, మాసీవ్ టైటిల్. ఇప్పటికే బాలయ్య ‘గాడ్ ఆఫ్ మాసెస్’గా మారిపోయిన విషయం తెలిసిందే. 

36

దీంతో రాబోయే చిత్రాలపై మరింతగా అంచనాలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ‘ఎన్బీకే107’గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి.. నిన్ననే కర్నూల్ కొండారెడ్డి బురుజుపై ‘వీరసింహారెడ్డి’ టైటిల్ ను రిలీజ్ చేశారు. బాలయ్య క్రేజ్ కు తగ్గట్టుగానే టైటిల్ ఉండటంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక చిత్రంలోని యాక్షన్స్, బాలయ్య యాటిట్యూడ్ ను గతంలో రిలీజ్ అయిన టీజర్ లో చూపించారు. 
 

46

అయితే, ‘అఖండ’లో డైలాగ్స్ హైలో ఉండటంతో ‘వీరసింహారెడ్డి’లోని డైలాగ్స్ పై మరింత ఆసక్తి పెరిగింది. ఈ క్రమంలో నిన్నటి ఈవెంట్ లో దర్శకుడు గోపీచంద్ మలినేని ఓ మాస్ డైలాగ్ ను వదిలారు. ‘వీరసింహారెడ్డి పుట్టింది పులిచర్ల, చదివింది అనంతపురం, రూలింగ్  కర్నూల్’ అనే డైలాగ్ చిత్రంలో మరిన్ని ఉన్నాయంటూ తెలిపారు. బాలయ్య అభిమానిగా ‘వీరసింహారెడ్డి’ని తెరకెక్కిస్తున్నాం. ఎక్కడా అభిమానుల అంచనాలకు తగ్గకుండా చూస్తామన్నారు. 
 

56

బాలయ్య సరసన గ్లామర్ బ్యూటీ శృతి హాసన్ (Shruti Haasan) నటిస్తోంది. దునియా విజయ్, వరలక్ష్మి శరత్‌కుమార్‌లు కీలక పాత్రలను పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రానికి నవీన్ యెర్నేని, వై రవిశంకర్‌లు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. 
 

66

ఇప్పటికే ‘అఖండ’కు చార్ట్ బాస్టర్ మ్యూజిక్ అందించిన సంగీత సంచలనం ఎస్ థమన్ ‘వీరసింహారెడ్డి’కి కూడా అదిరిపోయే మ్యూజిక్ అందిస్తున్నారు. నేషనల్ అవార్డ్ విన్నింగ్ క్రాఫ్ట్స్‌మెన్ నవీన్ నూలి ఎడిటింగ్‌ను నిర్వహిస్తుండగా, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్‌గా ఉన్నారు. స్పెషల్ నెంబర్ లో చంద్రిక రవి నటిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. 
 

click me!

Recommended Stories