శ్రీముఖి టాప్ యాంకర్స్ లో ఒకరు. సుమ, అనసూయ, రష్మీ గౌతమ్ తర్వాతి స్థానం ఆమెదే. పరిస్థితులు చూస్తే వాళ్ళను కూడా శ్రీముఖి దాటేయడం ఖాయంగా కనిపిస్తుంది. జాతి రత్నాలుతో పాటు పలు బుల్లితెర షోస్ కి ఆమె యాంకర్ గా ఉన్నారు. అలాగే ఈవెంట్స్, ప్రత్యేక కార్యక్రమాల్లో సందడి చేస్తున్నారు. ఇక ఒక్కో కాల్ షీట్ కి శ్రీముఖి లక్షల రూపాయలు ఆర్జిస్తున్నారు.