పెళ్లి కాదు బిజినెస్‌.. కన్‌ఫ్యూజ్‌ చేసిన హీరోయిన్‌

First Published | Jul 28, 2020, 1:46 PM IST

దాదాపు పదేళ్లుగా ఒంటరిగా ఉంటున్న ఓ హీరోయిన్ ఇటీవల వరుసగా పెళ్లికి సంబంధించి ట్వీట్లు చేస్తూ అభిమానులను ఊరించింది. దశాబ్దం క్రితమే విడాకులు తీసుకోవటంతో ఇన్నేళ్ల తరువాత ఈ అమ్మడికి పెళ్లి మీద గాలి మళ్లిందని భావించారు అంతా. అయితే అలా అనుకున్న వారిందరికీ షాక్‌ ఇస్తూ మరో ప్రకటన చేసింది ఈ బ్యూటీ.

ఇప్పటికే టాలీవుడ్‌ యంగ్ హీరో నిఖిల్‌, నితిన్‌లు ఓ ఇంటి వారు కాగా, త్వరలో టాలీవుడ్‌ హంక్‌ రానా దగ్గుబాటి కూడా పెళ్లి పీటలు ఎక్కేందుకు రెడీ అవుతున్నాడు. ఆగస్టు 8న రానా, మిహీకా బజాజ్‌ల వివాహం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల నడుమ ఘనంగా జరగనుంది.
undefined
వీరే కాదు సీనియర్ నిర్మాత దిల్ రాజు కూడా ఈ మధ్యే రెండో వివాహం చేసుకున్నాడు. ఇక తమిళ వివాదాస్పద నటి వనిత విజయ్‌ కుమార్‌ కూడా లాక్‌ డౌన్‌ సమయంలో మూడో వివాహం చేసుకొని రచ్చ చేసింది. కన్నడ నటుడు నిఖిల్‌ గౌడ్‌ కూడా లాక్‌ డౌన్‌లోనే పెళ్లి చేసుకున్నాడు.
undefined
Tap to resize

తాజాగా ఈ లిస్ట్‌లో చేరేందుకు మరో నటి రెడీ అవుతోందన్న వార్త కొద్ది రోజులుగా కోలీవుడ్‌లో హల్‌చల్ చేసింది. 7జీ బృందావన్‌ కాలనీ సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించిన బ్యూటీ సోనియా అగర్వాల్. ఆ సినిమాలో బోల్డ్ నటించి మెప్పించిన సోనియా ఆ చిత్ర దర్శకుడు సెల్వ రాఘవన్‌ను వివాహం చేసుకుంది.
undefined
2006లో పెళ్లి చేసుకున్న సెల్వ, సోనియాలు మనస్పర్థలతో 2010లో విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి ఒంటరిగానే ఉంటుంది సోనియా. అయితే కొద్ది రోజులుగా తన సోషల్ మీడియా పేజ్‌లో వరుసగా పెళ్లి సంబంధించిన వీడియోలు పోస్ట్‌ చేస్తూ వచ్చింది సోనియా. దీంతో పదేళ్ల తరువాత ఇప్పుడు తనకు ఓ తోడు కావాలని కోరుకుంటుంది అని అంతా భావించారు.
undefined
అయితే అలాంటి వారికి షాక్‌ ఇస్తూ తాను క్రియేటివ్‌ వెడ్డింగ్‌కు సంబంధించిన బిజినెస్‌ ను ప్రాంభించినట్టుగా ప్రకటించింది సోనియా అగర్వాల్. టేల్‌ ఆఫ్ టూ పేరుతో కొత్త బిజినెస్‌ ప్రారంభించింది సోనియా. దీంతో కొద్ది రోజులుగా ఆమె పెళ్లి అంటూ వస్తున్న వార్తలకు తెరపడినట్టైంది.
undefined

Latest Videos

click me!