చిత్ర పరిశ్రమలో చాలా హిట్ చిత్రాలు తెరకెక్కుతుంటాయి. యాక్షన్, లవ్ స్టోరీలు, ఫ్యామిలీ చిత్రాలు ఇలా డిఫెరెంట్ జోనర్స్ లో సినిమాలు వస్తుంటాయి. కానీ కేవలం యువతకి నచ్చే అంశాలతో విడుదలై సంచలన విజయం అందుకున్న చిత్రాలు కొన్ని మాత్రమే ఉంటాయి.
చిత్ర పరిశ్రమలో చాలా హిట్ చిత్రాలు తెరకెక్కుతుంటాయి. యాక్షన్, లవ్ స్టోరీలు, ఫ్యామిలీ చిత్రాలు ఇలా డిఫెరెంట్ జోనర్స్ లో సినిమాలు వస్తుంటాయి. కానీ కేవలం యువతకి నచ్చే అంశాలతో విడుదలై సంచలన విజయం అందుకున్న చిత్రాలు కొన్ని మాత్రమే ఉంటాయి. ఆ కోవకి చెందిన చిత్రం 7జి బృందావన కాలనీ. ఏఎమ్ రత్నం నిర్మాణంలో సెల్వరాఘవన్ దర్శకత్వంలో ఈ చిత్రం బోల్డ్ అండ్ ఎమోషనల్ లవ్ స్టోరీగా తెరకెక్కింది.
25
2004లో విడుదలైన ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో సంచలన విజయం అందుకుంది. యువత ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు. ఏఎం రత్నం తనయుడు రవికృష్ణ ఈ చిత్రంలో హీరో. సోనియా అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. రవికృష్ణ, సోనియా లవ్ సీన్స్ తో పాటు సుమన్ శెట్టి కామెడీ కూడా ఈ చిత్రంలో హైలైట్. ఓ ఇంటర్వ్యూలో రవికృష్ణ, సోనియా అగర్వాల్ ఈ చిత్రం గురించి మాట్లాడుతూ అప్పటి షూటింగ్ సంగతులని గుర్తు చేసుకున్నారు.
35
ఈ చిత్ర క్లైమాక్స్ లో వచ్చే జనవరి మాసం సాంగ్, అందులో రవికృష్ణ, సోనియా మధ్య బోల్డ్ రొమాన్స్ అప్పట్లో పెద్ద చర్చనీయాంశం అయింది. షూటింగ్ సంగతుల గురించి సోనియా మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ సెట్స్ లోకి మార్నింగ్ 5.30 లేదా 6 లోపు వచ్చేయాలి అని డైరెక్టర్ గారు స్ట్రిక్ట్ ఆర్డర్ వేసేవారు. మార్నింగ్ తమకి సంబంధించిన షాట్ ఉన్నా లేకపోయినా సెట్స్ లో అందరూ ఉండాలి. నేను 6 లోపు సెట్స్ కి వెళ్లిపోయేదాన్ని. నిద్ర సరిపోయేది కాదు. దీనితో మేకప్ రూమ్ కి వెళ్లి పడుకునేదాన్ని అని సోనియా తెలిపింది. మార్నింగ్ వచ్చి నైట్ 10 వరకు ఉండాల్సిందే అని సోనియా పేర్కొంది.
45
డైరెక్టర్ ఎవరినీ షూటింగ్ నుంచి త్వరగా పంపించరు అని సోనియా తెలిపింది. వెంటనే రవికృష్ణ మాట్లాడుతూ ఒకే ఒక్కసారి నన్ను త్వరగా పంపించారు. అందుకు కారణం ఉంది అని రవికృష్ణ తెలిపారు. ఆ రోజు జనవరి మాసం సాంగ్ షూటింగ్ జరుగుతోంది. ఆ టైంలో నాకు హై ఫీవర్. షెడ్యూల్ ముందుగా ఖరారైంది కాబట్టి జర్వం ఉన్నా నటించాల్సి వచ్చింది.
55
sonia agarwal, spb charan
ఆ సాంగ్ లో మేమిద్దరం రొమాన్స్ చేయాలి. రొమాన్స్ చేస్తూ హీరోయిన్ నా వీపుపై గోర్లతో గోకాలి. ఆమె గోర్లు ఆర్టిఫిషియల్ కాదు, నిజమైన గోర్లు. అయినా సోనియా స్మూత్ గా గోకకుండా నిజంగానే బలంగా గోకింది. దీనితో వీపు మొత్తం వాతలు పడి వాచిపోయింది. ఒకవైపు జ్వరం, మరోవైపు వాతాలతో ఇబ్బంది పడుతున్నా. వెళ్ళిపోదాం అంటే కుదరదు. డైరెక్టర్ నా బాధ చూసి నువ్వు షూటింగ్ నుంచి త్వరగా వెళ్ళిపో అన్నారు. వెంటనే అక్కడి నుంచి జంప్ అయినట్లు రవికృష్ణ సరదాగా చెప్పారు. రవికృష్ణ చెప్పిన విషయాలకు నటి సోనియా నవ్వు ఆపుకోలేకపోయింది.