Pushpa 2 : పుష్ప 2 కలెక్షన్లపై తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. టికెట్ ధరల పెంపు, బెనిఫిట్ షోల ద్వారా వచ్చిన లాభాలను కళాకారుల సంక్షేమానికి కేటాయించాలని పిటిషన్‌లో కోరారు.
Telangana HC plea against Pushpa 2 collections in telugu
Pushpa 2 : అల్లు అర్జున్ హీరోగా ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ ‘పుష్ప2’. రష్మిక హీరోయిన్ గా వచ్చిన ఈచిత్రం గతేడాది డిసెంబరులో విడుదలైంది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.1800 కోట్లకు పైగా వసూలు చేసింది.
ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగుతో పాటు, ఇతర భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ‘పుష్ప2: ది రూల్’కు (Pushpa 2) వచ్చిన లాభాలను చిన్న చిత్రాలకు బడ్జెట్ రాయితీకి వినియోగించాలని, జానపద కళాకారుల పింఛన్ కోసం కేటాయించాలని తెలంగాణ హైకోర్టులో (TG High Court) ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది.
23
Telangana HC plea against Pushpa 2 collections in telugu
‘పుష్ప2: ది రూల్’కలెక్షన్స్ విషయమై న్యాయవాది నరసింహారావు ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపు వల్ల ‘పుష్ప2’ చిత్రానికి భారీగా ఆదాయం వచ్చిందని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
హోంశాఖ ప్రత్యేక ఉత్తర్వులిచ్చి మరీ బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంచుకోవడానికి అనుమతి ఇచ్చిందన్నారు. బెనిఫిట్ షో, టికెట్ ధరలు పెంపునకు అనుమతివ్వడానికి గల కారణాలేంటో చెప్పలేదని న్యాయస్థానానికి వివరించారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం చిత్రాల లాభాలను కళాకారుల సంక్షేమానికి కేటాయించాలని కోరారు.
‘ఇప్పటికే బెనిఫిట్ షోలు, టికెట్ల వసూలు ముగిసింది కదా’ అని సీజే ప్రశ్నించగా, వాటి వల్ల వచ్చిన లాభం గురించే పిటిషన్ దాఖలు చేశామని న్యాయవాది వివరించారు. అయితే, అందుకు తగిన విధంగా సుప్రీంకోర్టు తీర్పు కాపీని సమర్పించాలని ఆదేశిస్తూ విచారణ హైకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది.
33
Telangana HC plea against Pushpa 2 collections in telugu
ఇక తక్కువ సమయంలో రూ. 1700 కోట్ల క్లబ్‌లో చేరిన భారతీయ చిత్రంగా ‘పుష్ప 2’ (Pushpa 2) రికార్డు నెలకొల్పింది. 21 రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 1705 కోట్లకుపైగా (గ్రాస్) (Pushpa 2 Collections in 21 Days) వసూలు చేసినట్టు చిత్ర బృందం వెల్లడించింది.
2024లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాగానూ ‘పుష్ప 2’ టాప్‌లో ఉంది. ఆరు రోజుల్లోనే రూ. 1000 కోట్ల క్లబ్‌లో చేరిన తొలి భారతీయ సినిమాగా, హిందీలో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా ‘పుష్ప 2’ రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే.