75th Independence Day
దొరల దోపిడీ దురాగతాలకు అడ్డుకట్ట వేశారు. బ్రిటీష్ కోటలు బద్దలు కొట్టి మువ్వన్నెల జెండా ఎగరేశారు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి నేటికి 75 ఏళ్లు గడిచాయి. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఢిల్లీ నుండి గల్లీ వరకు జాతీయపతాకం ఎగరవేసి అభివందనం చేస్తున్నారు. ఇక మన టాలీవుడ్ స్టార్స్ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. సదరు ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.
75th Independence Day
మెగా స్టార్ చిరంజీవి(Chiranjeevi) తల్లి అంజనా దేవితో పాటు జాతీయపతాకం ఎగరవేశారు. అలాగే మహాత్మా గాంధీజీకి నివాళులు అర్పించారు.
75th Independence Day
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో చిరంజీవితో పాటు నిర్మాత అల్లు అరవింద్ కూడా పాల్గొన్నారు. చిరంజీవి కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు.
75th Independence Day
మహేష్(Mahesh Babu) సోషల్ మీడియా వేదికగా అభిమానులకు, దేశ ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. కూతురు సితారతో పాటు జరుపుకున్న వేడుకకు సంబంధించినప్ ఫోటో షేర్ చేశారు.
75th Independence Day
బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో రోగులు, వైద్యులు, సిబ్బంది సమక్షంలో బాలకృష్ణ(Balakrishna) ఇండిపెండెన్స్ డే వేడుకలు నిర్వహించారు.
75th Independence Day
జెండా ఎగరవేశారు. అలాగే వేడుకల్లో పాల్గొన్న వారందరికీ మిఠాయిలు పంచారు. ప్రతి ఏడాది బాలకృష్ణ బసవతారకం ఆసుపత్రిలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహిస్తారు.
75th Independence Day
లైగర్ స్టార్ విజయ్ దేవరకొండ సైతం స్వాతంత్య్ర దినోత్సవ(75th independence day) వేడుకల్లో పాల్గొన్నారు. జాతీయ జెండా పక్కనే నిల్చొని ఆయన ఫోటో దిగారు. సదరు ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేశారు.
75th Independence Day
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) 75వ స్వాతంత్య్ర దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. ఆయన జండా ఆవిష్కరించారు. అలాగే బాపూజీకి నివాళులు అర్పించారు.
75th Independence Day
మంచు మోహన్ బాబు తన విద్యాసంస్థలలో స్వాతంత్య్ర వేడుకలు నిర్వహించారు. విద్యార్థుల సమక్షంలో ఇండిపెండెన్స్ వేడుకల్లో పాల్గొన్నారు.
75th Independence Day
మంచు విష్ణు సైతం ఈ వేడుకలకు హాజరయ్యారు. తిరుపతిలో గల శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి.
75th Independence Day
అలాగే టాలీవుడ్ టాప్ స్టార్ ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్ తో పాటు పలువురు హీరోలు సోషల్ మీడియా వేదికగా అభిమానులకు, దేశ ప్రజలకు ఇండిపెండెన్స్ డే విషెష్ తెలియజేశారు.