మోహన్ లాల్
సౌత్ లో ఫేమస్ హీరో మోహన్ లాల్ కి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కానీ, బాలీవుడ్ లో మాత్రం ఆయన సక్సెస్ కాలేదు. ఆయన హిందీలో నటించిన 'కంపెనీ', 'ఆగ్ ఔర్ తేజ్' సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.
అజిత్ కుమార్
సౌత్ లో టాలెంటెడ్ హీరో అజిత్ కుమార్ షారుఖ్ ఖాన్ సినిమా `అశోక`తో బాలీవుడ్ లోకి అడుగుపెట్టారు. కానీ, అక్కడ ఆయనకు పెద్దగా గుర్తింపు రాలేదు.
అక్కినేని నాగార్జున
సౌత్ లో స్టార్ హీరో అక్కినేని నాగార్జున బాలీవుడ్ లో సక్సెస్ కాలేదు. `శివ`, `కుదా గావా`, `ద్రోహి`, `మిస్టర్ బెచారా`, `క్రిమినల్`, `అగ్ని వర్ష్`, `ఎల్‌ఓసీ కార్గిల్`, `బ్రహ్మాస్త్ర` చిత్రాల్లో నటించాడు. కానీ అక్కడ సక్సెస్ కాలేకపోయారు.
మమ్ముట్టి
సౌత్ సూపర్ స్టార్ మమ్ముట్టి బాలీవుడ్ లో పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయారు. హిందీలో `ధర్టిపుత్ర`, `స్వామి వివేకానంద`, `సాహు జూత్ ఏక్ సాచ్`,`హల్ల బోల్` వంటి హిందీ చిత్రాల్లో నటించారు మమ్ముట్టి. కానీ ఇవి అక్కడ ఆడలేదు.
విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ నటించిన చాలా బాలీవుడ్ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. విజయ్ హిందీలో `లైగర్` మూవీ చేసిన విషయం తెలిసిందే. ఇది ఘోరంగా పరాజయం చెందింది.