కమల్, మణిరత్నం 'థగ్ లైఫ్' గురించి 7 ఆసక్తికర విషయాలు.. ఈ చిత్ర కథకి మూలం ఏంటో తెలుసా ?

Published : May 26, 2025, 10:09 AM IST

కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్‌లో చాలా కాలం తర్వాత వస్తున్న సినిమా 'థగ్ లైఫ్'. ఈ సినిమా గురించి చాలామందికి తెలియని 7 ఆసక్తికర విషయాలు ఇప్పుడు చూద్దాం.

PREV
17
‘థగ్ లైఫ్’ కథ

'థగ్ లైఫ్' కథ మొదట 'అమర్ హైన్' అనే సినిమా కోసం రాశారు. తర్వాత మణిరత్నం ఆ కథను తన సొంతంగా అనేక మార్పులు చేసుకున్నారు.

27
మారిన నటులు

మొదట 'థగ్ లైఫ్' లో రవి మోహన్, దుల్కర్ సల్మాన్‌లను నటింపచేయాలని అనుకున్నారు. తర్వాత వాళ్ల స్థానంలో సింబు, అశోక్ సెల్వన్‌లను తీసుకున్నారు.

37
మళ్ళీ కలిసిన నటులు

కమల్-మణిరత్నం మాత్రమే కాదు, చాలా మంది నటులు 'థగ్ లైఫ్' ద్వారా మళ్ళీ కలిశారు. 'విరుమాండి' తర్వాత కమల్-అభిరామి, 'విన్నైతాండి వరువాయా' తర్వాత సింబు-త్రిష కలిసి నటించారు.

47
'నాయకన్'తో పోలిక

'నాయకన్' చిత్రంతో ఈ చిత్రానికి కొన్ని పోలికలు ఉన్నాయి. రెండు ముఖ్య పాత్రల పేర్లు శక్తివేల్, నాయక్కర్. కథ గ్యాంగ్‌స్టర్ జీవితం చుట్టూ తిరుగుతుంది. ఇవన్నీ నాయకన్ మూవీతో థగ్ లైఫ్ చిత్రానికి ఉన్న పోలికలు.

57
షేక్స్పియర్ నవల ఆధారంగా..

మణిరత్నం నవలలు, సాహిత్యం, పురాణాల నుంచి సినిమాలు తీయడం కొత్త కాదు. 'దళపతి', 'రావణన్'.. మహాభారతం, రామాయణం ఆధారంగా తీసిన చిత్రాలు. ఈ సినిమా షేక్స్పియర్ 'మెక్‌బెత్' నవల ప్రేరణతో తీశారని అంటున్నారు.

67
జూన్ 5న రిలీజ్

జూన్ 5ని 'థగ్ లైఫ్' చిత్రం రిలీజ్ అవుతుండడంతో ఆసక్తి నెలకొంది. ఎందుకంటే కమల్ 'విక్రమ్' జూన్ 3న విడుదలై పెద్ద హిట్ అయ్యింది. జూన్ 2న మణిరత్నం పుట్టిన రోజు కూడా ఉంది.

77
'చెక్క చివంత వానం'

'థగ్ లైఫ్'ని 2018లో వచ్చిన 'చెక్క చివంత వానం'(తెలుగులో నవాబ్) తో పోలుస్తున్నారు. ఆ సినిమా కూడా ఒక క్రిమినల్ కుటుంబంలో అధికార పోరాటాల గురించి రూపొందింది.

Read more Photos on
click me!

Recommended Stories