Aamir Khan Third Marriage: మూడో పెళ్లికి రెడీ అవుతున్న అమీర్‌ ఖాన్‌. అమ్మాయి ఎవరో తెలుసా? ఆ హీరోయిన్‌ కాదు

Published : Feb 02, 2025, 12:44 PM IST

Aamir Khan Third Marriage: బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ త్వరలోనే మూడో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.

PREV
14
Aamir Khan Third Marriage: మూడో పెళ్లికి రెడీ అవుతున్న అమీర్‌ ఖాన్‌.  అమ్మాయి ఎవరో తెలుసా? ఆ హీరోయిన్‌ కాదు
అమీర్ ఖాన్ తదుపరి పెళ్లి

Aamir Khan Third Marriage Rumors: బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ 1986లో రీనా దత్తాను పెళ్లి చేసుకున్నారు. వీరికి జునైద్ ఖాన్, ఐరా అనే ఇద్దరు పిల్లలు జన్మించారు. జునైద్ ఖాన్ ప్రస్తుతం హీరోగా నటిస్తున్నారు. ఐరాకు గతేడాది పెళ్లయింది. అమీర్ ఖాన్ 2002లో రీనా దత్తాకు విడాకులిచ్చిన విషయం తెలిసిందే.

24
రెండుసార్లు విడాకులు తీసుకున్న అమీర్

రీనాతో విడిపోయాక కిరణ్ రావును పెళ్లి చేసుకున్నారు. వీరికి ఆజాద్ అనే కుమారుడు. ఈ పెళ్లి కూడా విడాకులతో ముగిసింది. 2021లో కిరణ్ రావుకు విడిపోతున్నట్టు ప్రకటించారు. రెండుసార్లు విడాకుల తర్వాత ఒంటరిగా ఉన్న అమీర్ మళ్ళీ ప్రేమలో పడ్డారట. ఆ మధ్య బాలీవుడ్‌ యంగ్‌ హీరోయిన్‌ ఫాతిమా సనా షేక్‌ తో ప్రేమలో పడ్డారని, ఈ ఇద్దరు సహజీవనం చేస్తున్నారనే రూమర్స్ వచ్చాయి. 

 

34
అమీర్ మూడో పెళ్లి ఎవరితో?

కానీ అందరికి షాకిస్తూ ఇప్పుడు మరో పేరు తెరపైకి వచ్చింది. సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేని అమ్మాయితో అమీర్‌ ప్రేమలో పడ్డారట. బెంగళూరుకు చెందిన ఓ యువతితో అమీర్ ప్రేమాయణం నడుపుతున్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని బాలీవుడ్ వర్గాల్లో టాక్. అయితే అమీర్ మాత్రం ఈ వార్తలపై స్పందించడం లేదు. 60 ఏళ్ళలో మూడో పెళ్లా అని అభిమానులు ఆశ్చర్యపోతున్నారు నెటిజన్లు. 

44
అమీర్ తదుపరి సినిమా

అమీర్ నటించిన 'లాల్ సింగ్ చద్దా' డిజాస్టర్ అయ్యాక రెండేళ్లు సినిమాలకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం 'సితారే జమీన్ పర్' సినిమాలో నటిస్తున్నారు. ఇది 'తారే జమీన్ పర్' సినిమాకు సీక్వెల్ అని తెలుస్తోంది. ఆర్.ఎస్.ప్రసన్న దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా తన కెరీర్ లోనే బెస్ట్ ఫిల్మ్ అవుతుందని అమీర్ ధీమా వ్యక్తం చేశారు.

read  more:  లో దుస్తులు కనిపించేలా కూర్చో, అలా చేస్తేనే ఆడియెన్స్ చూస్తారు.. సంచలన విషయం బయటపెట్టిన ప్రియాంక చోప్రా

also read:  Chiranjeevi next movie: `పూనకాలు లోడింగ్‌`.. చిరంజీవి నెక్ట్స్ సినిమా టైటిల్‌, మరో బ్లాక్‌ బస్టర్‌ లోడింగ్‌

 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories