సమంత నటించిన 'యశోద' చిత్రం మరి కాసేపట్లో ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. హరీష్ - హరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. కేవలం సమంతకి ఉన్న క్రేజ్ ఆధారంగానే ఈ చిత్రానికి ఇంత మంచి బజ్ ఏర్పడింది. ప్రేక్షకులు ఈ చిత్రంపై ఆసక్తి చూపడానికి ఎన్నో అంశాలు ముడిపడి ఉన్నాయి. వాటిలో ప్రధానంగా ఉన్న 5 కారణాల గురించి తెలుసుకుందాం.