స్టార్ హీరోలకు సబంధించిన చాలా సినిమాలు ఆగిపోయిన సందర్భాలు ఉన్నాయి. కొన్ని సినిమాలు కాస్త గ్యాప్ తీసుకుని రిలీజ్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి కోన్ని సినిమాలు మధ్యలో ఆర్టిస్ట్ లు చనిపోవడం వల్ల ఆగిపోయి.. లేట్ గా రిలీజ్ అయినవి ఉన్నాయి.
ఇంకొన్ని సినిమాలు ఆర్ధిక కష్టాల వల్ల రిలీజ్ అవ్వకుండా మరుగున పడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇందులో మనం చూసుకుంటే రిలీజ్ చేసే స్తోమత లేక కొన్ని సినిమాలు అలాగా వదిలేసి అడ్రస్ లేకుండాపోయిన సంఘటనలు కోకొల్లలు. ఇక అలాంటి సినిమా ఒకటి 40 ఏళ్ల తరువాత రిలీజ్ అయ్యింది.
Also Read: ఎన్టీఆర్ - బాలకృష్ణ గొడవపై డైరెక్టర్ బాబి క్లారిటీ
అయితే చిత్రం ఏంటంటే.. ఆసినిమా హీరో ఈసినిమా రిలీజ్ అయిన సమయానికి ఈలోకంలో లేరు. 90 ఏళ్లు దాటి.. మరణించారు కూడా. ఆ స్టార్ హీరోమరణించిన తరువాత రిలీజ్ అయిన ఈ సినిమా ఏంటి..? ఆ హీరో ఎవరో తెలుసా..? ఆ సి నిమా ఏదో కాదు ప్రతిబింబాలు. ఈసినిమా హీరో ఎవరో తెలుసా.. ద గ్రేట్ లెజండరీ యాక్టర్ అక్కినేని నాగేశ్వరావు.ఈసినిమా రిలీజ్ అవ్వడానికి ఏకంగా 40 ఏళ్లు పట్టింది.
Also Read: సుమన్ ను బ్లూ ఫిలిం కేసులో ఇరికించింది ఎవరు..?
ఈ గ్యాప్ లో మూడు తరాల హీరోలు టాలీవుడ్ కు వచ్చారు. ఏఎన్నార్ హీరోగా సినిమాలు ఆపేసి క్యారెక్టరోల్స్, తాత పాత్రలు కూడా చేశారు. ఇంకా చెప్పాలంటే ఆ మూవీ విడుదలయ్యే టైమ్ కు ఏఎన్నార్ ఈ లోకంలోనే లేరు. అవును ఈసినిమా వెనుక చాలా చరిత్ర ఉంది. అది రిలీజ్ చేయకపోవడానికి చాలా పెద్ద కారణమే ఉంది. ఇంతకీ ఏం జరిగిందంటే..?
సింగీతం శ్రీనివాస్ రావు డైరెక్షన్ లో ఏఎన్నార్, జయసుధ, తులసీ హీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా ప్రతిబింబాలు. ఈసినిమాను జాగర్లమూడి రాధాకృష్ణ నిర్మించారు. అయితే అప్పట్లో అంత పెద్ద స్టార్ డమ్ ఉన్న ఏఎన్నార్ సినిమా ఎందుకు రిలీజ్ కాలేదు ఏం సమస్యలు వచ్చి ఉంటాయి అని మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు. దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు… ఏఎన్నార్, జయసుధ హీరో హీరోయిన్స్ గా ప్రతిబింబాలు టైటిల్ తో మూవీ స్టార్ట్ చేశారు.
కాని సినిమా షూటింగ్ మధ్యలో ఉండగా నాగేశ్వరావు కు గుండె పోటు వచ్చిందట. వెంటనే ఆయనకు సర్జరీ జరిగింది. సర్జరీ నుంచి కోలుకుని ఆయన సెట్స్ లోకి రావడానికి చాలా టైమ్ పట్టిందట. దాంతో దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు వేరే షెడ్యుల్స్ ఉండటంతో సినిమా నుంచి తప్పుకున్నారట. దాంత రాఘవేంద్రరావు తండ్రి ప్రకాశరావు ఈసినిమా బాధ్యతలు తీసుకున్నారు. ఎలాగోలా సినిమాను పూర్తి చేశారు.
కాని అప్పటికే నిర్మాతకు ఆర్ధిక ఇబ్బందుల కారణంగా ఈసినిమా రిలీజ్ చేయలేదట. అలా మరుగున పడిపోయిన ప్రతిబింబాలు చిత్రాన్ని 2022 నవంబర్ 5న ఏఎన్నార్ జయంతి సందర్భంగా 250కి పైగా థియేటర్స్ లో విడుదల చేశారు. కలర్ ప్రింట్ చేయించిఈ సినిమాకు కాస్త టెక్నాలజీని కూడా ఆడ్ చేసి.. సినిమాను రిలీజ్ చేశారు. కాని ఎక్కువగా ప్రచారం చేయకపోవడం..రకరకాల కారణంగా ఈసినిమాను ఆడియన్స్ పెద్దగా పట్టించుకోలేదు.