ఎన్టీఆర్ ‌- బాలకృష్ణ గొడవపై డైరెక్టర్ బాబి క్లారిటీ, బాలయ్య తారక్ గురించి బాబీ దగ్గర ఏం చెప్పాడంటే..?

First Published | Jan 7, 2025, 7:58 PM IST

నిజంగా బాలకృష్ణకు ఎన్టీఆర్ కు మధ్య గ్యాప్ ఉందా...? తారక్ ను బాలయ్య దూరం పెడుతున్నాడా..? ఈ విషయంలో డైరెక్టర్ బాబీ ఇచ్చిన క్లారిటీ ఏంటి..? జూనియర్ ఎన్టీఆర్ గురించి బాలయ్య చెప్పిన విషయం ఏంటి..?
 

బాలయ్య- ఎన్టీఆర్ మధ్య గొడవల గురించి డైరెక్టర్ బాబీ క్లారిటీ ఇచ్చాడు. ఎన్టీఆర్ ను బాలకృష్ణ దూరం పెడుతున్నాడని. దగ్గరకు రానివ్వడంలేదు అని.. వీరిమధ్య గ్యాప్ చాలా పెరిగిపోయిందని వరుసగా వార్తలు వైరల్ అవుతూ వచ్చాయి. అంతే కాదు అన్ స్టాపబుల్ అంటూ రెండు సీజన్లు విజయవంతంగా హోస్టింగ్ చేసిన బాలకృష్ణ.. వచ్చే గెస్ట్ లకు కూడా తారక్ మాట ఎత్త వద్దు అని ముందు చెప్పినట్టు వార్తలు వైరల్ అయ్యాయి. 

ఇక తాజాగా డాకూ మహరాజ్ సినిమా టీమ్ అన్ స్టాపబుల్ షోకి వచ్చినప్పుడు కూడా ఓ ఇన్సిడెంట్ జరిగింది. బాబీ చేసిన సినిమాలకు సబంధించిన పోస్టర్లు వేస్తూ.. బాలయ్య కామెంట్ చేశారు కాని.. బాబీ డైరెక్ట్ చేసిన ఎన్టీఆర్ మూవీ జైలవకుష కు సబంధించిన పోస్టర్ మాత్రం వేయలేదు. దాంతో పెద్ద ఎత్తున ఈ టాపిక్ వైరల్ అయ్యింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ విషయంలో మండి పడ్డారు. బాలయ్య సినిమాను బాయ్ కాట్ చేస్తామంటూ వార్నింగ్స్ కూడా ఇచ్చారు. 
 


ఈట్రోల్స్ మధ్య.. ఈ విషయంల్ క్లారిటీ ఎవరు ఇస్తారా అని అంతా ఎదురు చూశారు. ఈక్రమంలో తాజాగా బాబీ ఈ విషయంలో క్లారిటీ ఇచ్చాడు. డాకు మహరాజ్ సినిమాకు సబంధించిన ప్రెస్ మీట్ ను నిర్వహాంచారు మూవీ టీమ్. ఈ ప్రస్ మీట్ లో నిర్మాత నాగవంశీతో పాటు దర్శకుడు బాబీ, హీరోయిన్ ప్రగ్యాజైశ్వాల్ కూడా పాల్గొన్నారు. అయితే ఈక్రమంలో ఏసియన్ నెట్ తెలుగు న్యూస్ కు చెందిన మీడియా ప్రతినిథి రాజు అడిగిన ప్రశ్నకు బాబీ క్లియర్ గా సమాధానం చెప్పారు. 
 


మీ షోలో తారక్ కు సబంధించిన ప్రస్తావన రావద్దు అని ముందుగానే చెప్పారట నిజమేనా అని ప్రశ్నించగా. .. బాబీ మాట్లాడుతూ.. అదే లేదు. అంత డ్రామా జరగలేదు. కవర్ చేసుకోవల్సిన అవసరం కూడా లేదు.  ఏదో స్లైడ్ చేస్తూ వచ్చిన సినిమా పోస్టర్స్ గురించి ఆయన మాట్లాడారు. 

ఆ ప్రోగ్రం గ్యాప్ ఇస్తు జరుగుతుంది దాంతో అంతా టెలికాస్ట్ కాదు. కావాలని మాత్రం అక్కడేం జరగలేదు. అసలు ఆ ఇష్యూ లేనే లేదు. తారక్ గురించి బాలయ్య రెండు మూడు సార్లు నాతో మాట్లాడారు. తారక్ సినిమాల్లో అది బాగుంటుంది ఇది బాగుంటుంది అని మేమే మాట్లాడుకున్నాం.

మరీ ముఖ్యంగా జై లవకుశ సినిమా అంటే బాలకృష్ణ గారికి చాలా ఇష్టం. నాతో చాలా సార్లు చెప్పారు కూడా. మనమే ఏదో ఏదో ఊహించుకుని ఒక ఫ్యామిలీ ఇష్యూని పెద్దగా చేసి చూస్తున్నాం.. అదేం లేదు. అంటూ క్లియర్ గా చెప్పారు బాబి. 

Daaku Maharaaj, balakrishna, bobby

దీంతో గత కొన్ని రోజులుగా అన్ స్టాపబుల్ లో ఎన్టీఆర్ సినిమా పోస్టర్ వివాదానికి పుల్ స్టాప్ పెట్టినట్టు అయ్యింది. అంతే కాదు వీరిద్దరి మధ్య ఏం గొడవ లేదు అని బాబి క్లారిటీ ఇచ్చినట్టు కూడా అయ్యింది. ఇక బాలయ్య బాబు నటించిన డాకూ మహరాజ్ సంక్రాంతి సందర్భంగా ఈనెల 12న భారీ ఎత్తున రిలీజ్ కాబోతోంది. బాలయ్య కెరీర్ లో 100కోట్ల బడ్డెట్ తో నిర్మించిన సినిమా ఇదే. ఈ సినిమాలో ప్రగ్య జైస్వాల్ హీరోయిన్ గా నటించింది. 

Latest Videos

click me!