ఏళ్ళు గడుస్తున్నాయి కానీ కొందరు హీరోయిన్ పెళ్లి ఊసే ఎత్తడం లేదు. 35 ఏళ్ళు నిండినా కూడా కొందరు హీరోయిన్లు సింగిల్ గానే ఉంటున్నారు. కొందరు సినిమాలతో బిజీగా ఉంటే మరికొందరికి ఆఫర్స్ అంతంత మాత్రమే. కనీసం 2024లో అయినా పెళ్లి పీటలు ఎక్కాల్సిన హీరోయిన్లు వీళ్ళే.
ప్రగ్యా జైస్వాల్ :ప్రగ్యా జైస్వాల్ వయసు 36. ఆమెకి హీరోయిన్ గా ఆఫర్స్ అంతంతమాత్రమే ఉన్నాయి. ప్రగ్యా జైస్వాల్ చివరగా నటించిన చిత్రం అఖండ. ఆ తర్వాత ఆమెకి చెప్పుకోదగ్గ ఆఫర్స్ రాలేదు. ఇక ఈ హాట్ బ్యూటీ పెళ్లి ఊసు కూడా ఎత్తడం లేదు. 2024లో అయినా మూడుముళ్ల బంధంలోకి అడుగుపెడుతోందో లేదో చూడాలి.
29
తాప్సీ: తాప్సి బాలీవుడ్ లో హీరోయిన్ సెంట్రిక్ కథలు, నటనకు ప్రాధాన్యత ఉన్న చిత్రాలు చేస్తోంది. తాప్సి లవ్ ఎఫైర్ గురించి వార్తలు వస్తున్నాయి. కానీ 36 ఏళ్ళు నిండినా ఇంకా చేసుకోలేదు.
39
శృతి హాసన్: శృతి హాసన్ ఇప్పటికి సౌత్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ఆమె వయసు 37 ఏళ్ళు. శృతి హాసన్ పెళ్లి చేసుకోలేదు కానీ సింగిల్ మాత్రం కాదు. తన బాయ్ ఫ్రెండ్ శాంతను తో లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. 2024లో ఈ జంట వివాహ బంధంలోకి అడుగుపెడతారేమో చూడాలి.
49
త్రిష : త్రిష వయసు ఏకంగా 40 ప్లస్. ఈ ఏజ్ లో కూడా త్రిషకి ఆఫర్స్ వెల్లువలా వస్తున్నాయి. కానీ నాలుగు పదుల వయసు దాటినా ఈ ముద్దుగుమ్మ ఇంకా తనకి కాబోయే వాడిని వెతుక్కోలేదు. 2024లో త్రిష పెళ్లి చేసుకుంటుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
59
నిత్యా మీనన్ :నిత్యామీనన్ వయసు 35 కాదు కానీ 33. కెరీర్ ఆరంభంలో వచ్చినన్ని ఆఫర్స్ ఇప్పుడు నిత్యామీనన్ కి రావడం లేదు. అయితే అప్పుడప్పుడూ సినిమాల్లో, వెబ్ సిరీస్ లలో మెరుస్తోంది. 2024 లో పెళ్లి విషయంలో నిత్య మీనన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
69
నేహా శర్మ : చిరుత హీరోయిన్ నేహా శర్మ వయసు 36 ఏళ్ళు సోషల్ మీడియాలో హాట్ ఫొటోస్ తో యువతని అట్రాక్ట్ చేయడం తప్ప నేహా శర్మ పెద్దగా సినిమాల్లో నటించడం లేదు. 2024లో అయినా ఈ బోల్డ్ బ్యూటీ పెళ్లి పీటలెక్కుతుందో లేదో చూడాలి.
79
అనుష్క శెట్టి : అనుష్క శెట్టి గురించి చెప్పేదేముంది. ప్రస్తుతం అనుష్క వయసు 42 ఏళ్ళు. అనుష్క పెళ్లి గురించి ఇదిగో అదిగో అంటూ రూమర్స్ రావడం తప్ప అడుగు ముందుకు పడడం లేదు. 2024లో అయినా దేవసేన పెళ్లి చేసుకుంటుందా లేక ఎప్పటిలాగే సీన్ రిపీట్ అవుతుందా అనేది చూడాలి.
89
అంజలి :జర్నీ ఫేమ్ అంజలి వయసు 37. అచ్చ తెలుగు బ్యూటీ అయిన అంజలి కి కూడా ఆఫర్స్ అంతంత మాత్రమే. మరి 2024లో అయినా అంజలి మ్యారేజ్ విషయాల్లో డెసిషన్ తీసుకుంటుందేమో చూడాలి. ఆ మధ్యన తమిళ హీరో జై తో కొంతకాలం రిలేషన్ లో ఉన్నప్పటికీ ఆ తర్వాత విడిపోయారు.
99
కేథరిన్ : కేథరిన్ 35 ఏళ్ల వయసులోకి అడుగుపెట్టింది. కేథరిన్ కి కూడా ఆఫర్స్ పెద్దగా లేవు. వచ్చిన అవకాశాలు కూడా ప్రాధాన్యత ఉన్న పాత్రలు కాదు. కానీ కేథరిన్ ఇంకా ఆఫర్స్ కోసం ప్రయత్నిస్తూ పెళ్లి ఊసే ఎత్తడం లేదు.